Sir Movie : ‘సార్’ సినిమాని పైరసీ చేస్తే ఇలా కంప్లైంట్ చేయండి.. పైరసీని ఎంకరేజ్ చేయకండి..

సార్ సినిమా మాస్ బంక్ యాంటీ పైరసీ అనే ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా ఎక్కడా పైరసీ అవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. దీంతో ఎక్కడైనా సార్ సినిమా పైరసీ లింక్స్ కనపడినా, ఎవరైనా పైరసీ చేసినట్టు తెలిసినా...................

Sir Movie : ‘సార్’ సినిమాని పైరసీ చేస్తే ఇలా కంప్లైంట్ చేయండి.. పైరసీని ఎంకరేజ్ చేయకండి..

if you find Sir Movie Piracy then contact and intimate to MassBunk Anti Pirasy

Sir Movie :  తమిళ్ స్టార్ హీరో ధనుష్ మొదటి సారి తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేశాడు. ధనుష్, సంయుక్త జంటగా దర్శకుడు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సార్ సినిమా తెరకెక్కింది. సార్ సినిమాని తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ గా తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్ అని, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని ముందు నుంచే చెప్తూ సినిమాని ప్రమోట్ చేశారు చిత్రయూనిట్. ఇక ముందురోజే ప్రీమియర్ షోలు పడటంతో సినిమా సూపర్ హిట్ టాక్ ఆల్రెడీ వచ్చేసింది. ప్రస్తుత తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో సార్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా హిట్ అవ్వడంతో ధనుష్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇక సినిమాలు రిలీజ్ అయితే వాటికి ఉండే పెద్ద సమస్య పైరసీ. గతంలో ఈ పైరసీ చాలా ఎక్కువగా ఉండేది. సైబర్ క్రైమ్ టీం దీనిపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో మధ్యలో కొన్ని రోజులు పైరసీ కంట్రోల్ లో ఉన్నా మళ్ళీ ఇటీవల పైరసీ కొత్త పుంతలు తొక్కుతూ వస్తుంది. సినిమా రిలీజయిన మొదటి షో తర్వాతే పలు పైరసీ సైట్లు సినిమాని అప్లోడ్ చేసేస్తున్నాయి. ఇక ఓటీటీల్లో వచ్చే సినిమాలు అయితే HD క్వాలిటీతో పైరసీ అవుతున్నాయి. తాజాగా సార్ సినిమా రిలీజ్ అవ్వడంతో దీనిని కూడా పైరసీ చేయాలని చూస్తున్నాయి కొన్ని పైరసీ సైట్లు.

Samyuktha : సార్ సూపర్ హిట్ తో టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టిన సంయుక్త..

దీంతో సార్ సినిమా మాస్ బంక్ యాంటీ పైరసీ అనే ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా ఎక్కడా పైరసీ అవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. దీంతో ఎక్కడైనా సార్ సినిమా పైరసీ లింక్స్ కనపడినా, ఎవరైనా పైరసీ చేసినట్టు తెలిసినా COPYRIGHT@MASSBUNKANTIPIRACY.COM కు మెయిల్ చేయమని లేదా మాస్ బంక్ యాంటీ పైరసీ సోషల్ మీడియా అకౌంట్స్ కి మెసేజ్ చేయమని ప్రకటించింది. సార్ సినిమా పైరసీ అవ్వకుండా చిత్ర నిర్మాతలు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా పైరసీ చేస్తే చట్టపరంగా కఠిన శిక్ష తప్పదన్నారు. ధనుష్ అభిమానులు కూడా సినిమా పైరసీ అవ్వకుండా చూస్తున్నారు.