Ram Charan : రామ్‌చరణ్‌తో సినిమా చేస్తే.. ఆ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కాల్సిందేనా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తే చాలు ఆ హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. మొన్న సమంత, నిన్న అలియా, ఇప్పుడు కియారా..

Ram Charan : రామ్‌చరణ్‌తో సినిమా చేస్తే.. ఆ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కాల్సిందేనా?

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తే చాలు ఆ హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ RC15 లో నటిస్తున్నాడు. ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ చేస్తుంది. తాజాగా ఈ భామ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న కియారా ఇటీవలే అతడితో ఏడడుగులు వేసింది. అయితే చరణ్ తో వర్క్ చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుంది ఈ భామ ఒకటే కాదు, మరికొంత మంది కూడా ఉన్నారు.

Ram Charan : రామ్‌చరణ్ నటనకి ఫ్యాన్ అయ్యాను.. శివరాజ్ కుమార్!

RRR లో చరణ్ సరసన అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ అయ్యిన కొద్ది రోజులకే అలియా, రణ్‌బీర్ కపూర్ ని పెళ్లాడింది. అంతకంటే ముందు సమంత విషయంలో కూడా ఇదే జరిగింది. రంగస్థలం మూవీలో సమంత, చరణ్ తో కలిసి నటించింది. ఆ మూవీ షూటింగ్ లో ఉన్న సమయంలోనే సమంత, నాగ చైతన్యని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే సమంత ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి కన్‌ఫార్మ్ అయ్యింది. కానీ కియారా, అలియా విషయంలో మాత్రం మూవీ టైంలోనే అంతా జరిగింది.

దీంతో రామ్ చరణ్ తో పని చేస్తుంటే ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజెన్లు ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. కాగా RC15 నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో మొదలు కాబోతుందట. ఈ షెడ్యూల్ లో చరణ్, కియారా పై ఒక సాంగ్ చిత్రీకరించనున్నాడు దర్శకుడు శంకర్. దాదాపు 500 డాన్సర్స్ తో ఈ పాట ఉండనున్నట్లు సమాచారం. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.