IFFI:ముగిసిన ‘ఇఫి’ వేడుకలు – విజేతల వివరాలు

ముగిసిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి 2019) స్వర్ణోత్సవాలు..

IFFI:ముగిసిన ‘ఇఫి’ వేడుకలు – విజేతల వివరాలు

Iffi 2019 Full List Winners

ముగిసిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి 2019) స్వర్ణోత్సవాలు..

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి 2019) స్వర్ణోత్సవాలు గోవాలో అంగరంగవైభంగా ముగిశాయి. చివరిరోజు సంగీత దర్శకుడు ఇళయరాజా, నటులు ప్రేమ్‌ చోప్రా, అరవింద్‌ స్వామి, కథక్‌ నృత్యకళాకారుడు బిర్జు మహారాజ్‌, మణిపురి దర్శకుడు హవోబమ్‌ పవన్‌కుమార్‌, అస్సామీ దర్శకురాలు మంజూ బోరా తదితరులను సత్కారించారు…

Image result for iffi film festival ilayaraja 2019

భారతీయ సంస్కృతిని తెలిపే నృత్య ప్రదర్శనలు… హరిహరన్‌ స్వరాలాపనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకకు గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, హిందీ దర్శకుడు రోహిత్‌ శెట్టి, తెలుగు నటీనటులు నిత్యా మీనన్‌, రకుల్‌ ప్రీత్‌, రష్మిక, విజయ్‌ దేవరకొండ తదితరులు హాజరయ్యారు.

‘ఇఫీ’ విజేతల వివరాలు :
ఉత్తమ చిత్రం (గోల్డెన్ పీకాక్ అవార్డ్): పార్టికల్స్‌ (ఫ్రెంచ్‌ చిత్రం)
ఉత్తమ నటుడు (సిల్వర్ పీకాక్ అవార్డ్): సివ్‌జార్జ్‌ (‘మరిఘెల్లా’ – పోర్చుగీస్‌)
ఉత్తమ నటి (సిల్వర్ పీకాక్ అవార్డ్): ఉషా జాదవ్‌ (‘మాయ్ ఘాట్‌’ – మరాఠీ)
ఉత్తమ దర్శకుడు: లిజో జోస్‌ పెల్లిస్సెరీ (‘జల్లికట్టు’ – మలయాళం)
స్పెషల్‌ జ్యూరీ: ‘బెలూన్‌’ (చైనీస్‌)
స్పెషల్‌ మెన్షన్‌: హెల్లారో (గుజరాతీ)
ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పురస్కారం: రువాండా దర్శకుడు రికార్డో సాల్వెట్టి.