Kashmir Files : చల్లారిన కశ్మీర్ ఫైల్స్ వివాదం.. క్షమాపణలు చెప్పిన IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్

తాజాగా IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విమర్శలపై స్పందించారు. ''నేనెప్పుడూ ఎవరిని అవమానించాలనుకొను, నేను ఆ రోజు మాట్లాడిన మాటలకి ఎవరైనా బాధపడితే.......................

Kashmir Files : చల్లారిన కశ్మీర్ ఫైల్స్ వివాదం.. క్షమాపణలు చెప్పిన IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్

IFFI Jury Head Nadav Lapid says sorry in Kashmir files Issue

Kashmir Files :  ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకల్లో కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా ప్రదర్శనకి వచ్చింది. 1990లో కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన దురాగతాలను కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే IFFI వేడుకల్లో ఈ సినిమాపై IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్ వేదికపైనే సంచలన వ్యాఖ్యలు చేశాడు.

IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్ వేదికపై మాట్లాడుతూ.. ”ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి చూసి మేము ఖంగుతిన్నాము. ఇది ఒక వల్గర్ కంటెంట్ తో రాజకీయ ఉద్దేశంతో తెరకెక్కిన సినిమాలా ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్ చూపించినవన్ని అవాస్తవం అని అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి ఒక అంతర్జాతీయ వేదికపై అటువంటి సినిమాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. దీంతో నదవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపాయి. కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్, సినిమా అభిమానులు, హిందువులు, కశ్మీర్ పండిట్స్, పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు.. నవాద్ పై తీవ్ర విమర్శలు చేశారు. అతను ఇజ్రాయిల్ దేశం వాడు కావడంతో ఇజ్రాయిల్ దేశ ప్రముఖులు కూడా నదవ్ పై విమర్శలు చేశారు.

Manjima Mohan : పెళ్ళిఫోటోల్లో కూడా లావుగా ఉన్నానని ట్రోల్ చేశారు..

తాజాగా IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విమర్శలపై స్పందించారు. ”నేనెప్పుడూ ఎవరిని అవమానించాలనుకొను, నేను ఆ రోజు మాట్లాడిన మాటలకి ఎవరైనా బాధపడితే అందుకు క్షమాపణలు అడుగుతున్నాను. చిత్ర దర్శకుడి కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను” అంటూ క్షమాపణలు కోరాడు. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సమాచారాన్ని ట్విట్టర్ లో షేర్ చేసి.. ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ పరుడు అని అన్నారు. నదవ్ లాపిడ్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.