Ileana DCruz : ప్రెగ్నెన్సీ, ఆత్మహత్యాయత్నం వార్తలపై మౌనం వీడిన గోవా బ్యూటీ ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానాకు ప్రెగ్నెన్నీ అని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు అప్పట్లో కలకలం రేపాయి. పెద్ద చర్చే జరిగింది. దానిపై అప్పుడు స్పందించని ఇలియానా.. ఎట్టకేలకు మౌనం వీడింది. ఆ వార్తలపై ఇప్పుడు రియాక్ట్ అయ్యింది. ప్రెగ్నెన్సీ, అబార్షన్, సూసైడ్ అటెంప్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఇల్లీ బేబ్.

Ileana DCruz : ప్రెగ్నెన్సీ, ఆత్మహత్యాయత్నం వార్తలపై మౌనం వీడిన గోవా బ్యూటీ ఇలియానా

Ileana Dcruz

Ileana DCruz : గోవా బ్యూటీ ఇలియానాకు ప్రెగ్నెన్నీ అని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు అప్పట్లో కలకలం రేపాయి. పెద్ద చర్చే జరిగింది. దానిపై అప్పుడు స్పందించని ఇలియానా.. ఎట్టకేలకు మౌనం వీడింది. ఆ వార్తలపై ఇప్పుడు రియాక్ట్ అయ్యింది. ప్రెగ్నెన్సీ, అబార్షన్, సూసైడ్ అటెంప్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఇల్లీ బేబ్.

‘కొన్నేళ్ల క్రితం ఆండ్రూ అనే వ్యక్తితో నేను రిలేషన్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాలతో పరస్పర అంగీకారంతో మేమిద్దరం 2019లో విడిపోయాం. అయితే, మేమిద్దరం రిలేషన్‌లో ఉన్న సమయంలో నేను గర్భం దాల్చానని, అలాగే అబార్షన్‌ చేయించుకున్నానని ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అవన్నీ అబద్ధం. ఆ వార్తలు కేవలం అవాస్తవాలు మాత్రమే’ అని ఇలియానా తేల్చింది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

‘‘ఆండ్రూతో నేను విడిపోయిన సమయంలో అందరిలానే నాకూ ఎంతో బాధగా అనిపించింది. అదే సమయంలో నేను ఆత్మహత్యకు పాల్పడ్డానని అందరూ చెప్పుకున్నారు. నేను బలవన్మరణానికి పాల్పడుతుంటే నా పనిమనిషి నన్ను ఆపిందని.. ఆమె వల్ల నేను ప్రాణాలతో ఉన్నానని అప్పట్లో పుకార్లు వినిపించాయి. నిజం చెప్పాలంటే నేను ఆత్మహత్య ప్రయత్నాలు అస్సలు చేసుకోలేదు. అలాగే అసలు నాకు పనిమనిషి అంటూ ఎవరూ లేరు. నా గురించి ఇలాంటి వార్తలు బయటకు రావడం చూసి వింతగా అనిపించింది’’ అని తన గురించి వచ్చిన రూమర్స్‌పై ఇలియానా స్పష్టత ఇచ్చింది.

చాలారోజుల తర్వాత ‘బిగ్‌బుల్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఇలియానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి వైరల్‌గా మారిన వార్తలపై స్పందించింది. చాలా సందర్భాల్లో తన గురించి ఎన్నో పుకార్లు వచ్చాయని ఇలియానా అంది. అందులో ప్రెగ్నెన్సీ వార్త ఒకటని చెప్పింది.