Ileana D’Cruz: రామారావుతో ఐటెం పాటలో ఇల్లీబేబీ!

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే కాగా త్వరలోనే, ఖిలాడీ, రామారావుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఖిలాడీ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తికాగా

Ileana D’Cruz: రామారావుతో ఐటెం పాటలో ఇల్లీబేబీ!

Ileana D'cruz

Ileana D’Cruz: మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే కాగా త్వరలోనే, ఖిలాడీ, రామారావుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఖిలాడీ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తికాగా విడుదలకు సరైన టైమ్ కోసం వచ్చి ఉన్నాడు. ఇక రవితేజ 68 చిత్రంగా రామారావు ఆన్ డ్యూటీ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు పెంచేయగా.. దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ ప్రభుత్వ అధికారిగా రవితేజా ఎలా కనిపించనున్నాడా అని ఆసక్తిగా మారింది.

కొన్ని నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో రూపొందుతున్న రామారావు ఆన్ డ్యూటీ ప్రత్యేకమైన థ్రిల్లర్ సినిమా కాగా దివ్యన్షా కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ముమ్మర షూటింగ్ లో ఉన్న ఈ సినిమా నుండి ఓ ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. ఈ సినిమాలో రామారావుతో కలిసి ఇలియానా ఐటెం భామగా చిందులేయనున్నట్లుగా తెలుస్తుంది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రవితేజతోనే మళ్ళీ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ సినిమా కూడా పరాజయమవడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.

ఈ మధ్యనే బాలయ్య అఖండ సినిమాలో ఇలియానా నటించనుందని ప్రచారం జరిగినా ఎందుకో ఆ సినిమాను ఇలియానా రిజెక్ట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు రవితేజతో ఐటెం పాటకు ఒకే చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. తమన్నా లాంటి నాయకలు ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే ఐటెం సాంగ్స్ నుండి ఓటీటీ వెబ్ సిరీస్ వరకు బిజీగా ఉండడంతో వీరి తరహాలోనే ఇల్లీ బేబీ కూడా కెరీర్ ప్లాన్ చేసుకోవాలని రామారావుతో ఐటెం గీతానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఇల్లీ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.