Ileana D’Cruz: ఏడుస్తున్న ఫోటోలు షేర్ చేసిన ఇల్లీ.. కారణం ఏంటంటే?

గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్య తెలుగులో పెద్దగా కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు తన సోకులతోనే కుర్రాళ్ళకి చెమటలు పట్టించేది. దేవదాస్ నుండి మొదలైన ఇల్లీ బేబీ ప్రవాహం.. పోకిరి, జల్సా..

Ileana D’Cruz: ఏడుస్తున్న ఫోటోలు షేర్ చేసిన ఇల్లీ.. కారణం ఏంటంటే?

Ileana D'cruz

Ileana D’Cruz: గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్య తెలుగులో పెద్దగా కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు తన సోకులతోనే కుర్రాళ్ళకి చెమటలు పట్టించేది. దేవదాస్ నుండి మొదలైన ఇల్లీ బేబీ ప్రవాహం.. పోకిరి, జల్సా, జులాయి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. అయితే.. బాలీవుడ్ మీద ఫోకస్ చేసిన ఇల్లీ తెలుగుకు దూరమైంది. కానీ.. బీ టౌన్ లో కూడా సక్సెస్ కాలేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ దక్షణాది మీద కన్నేసింది.

Isha Chawla: తడి దుస్తులతో దాహం పెంచిన ఢిల్లీ భామ!

అయితే, ప్రస్తుతం ఇలియానా చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. `తేరా క్యా హోగా లవ్లీ` సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. తెలుగులో మరో సినిమా చేయబోతుందని సమాచారం. నాగార్జున నటిస్తున్న `ఘోస్ట్` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలొచ్చాయి. కాజల్‌ స్థానంలో ఇలియానాని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Samantha: మనిషి అసలు స్వభావం బయటపడే సందర్భం ఇదే!

కాగా, ఇలియానా చిన్నపిల్లలా ఏడ్చేసింది. అంతేకాదు ‘ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని’ కూడా చెప్పుకొస్తుంది. ఇంతకీ ఈ ఏడుపుకి కారణం ఏంటంటే.. వంట చేద్దామని కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటంవల్ల గాయం బాగానే అయింది. ఆ విషయం గురించి ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇలియానా రెండు వేళ్లకు గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడ్చేశాను అని పోస్ట్ పెట్టింది.

Neha Sharma: చెలరేగిపోతున్న బాఘ‌ల్ పూర్ భామ నేహా!

‘ఏడవడానికి సిగ్గుపడకూడదు. ఒంటి చేత్తో వేళ్లకు బ్యాండేజ్‌ వేయడం అంత తేలికైన పని కాదు’ అంటూ తాను ఏడ్చిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. గతంలో కూడా వంట చేస్తున్నప్పుడు ఇలా గాయం అయిందని, అయినప్పటికీ ఇంకా తనకు వేళ్లు ఉండటం ఆశ్చర్యంగా ఉందని బాధలో కూడా సరదాగా నెటిజన్లతో పంచుకుంది.