Mahesh – Rajamouli Movie : మహేష్ సినిమా రాజమౌళికి సవాలు విసురుతుందా??

RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా అవార్డుల పంట పండిస్తోంది. దీంతో అదే టైమ్ లో రాజమౌళి నెక్స్ట్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు తో.............

Mahesh – Rajamouli Movie : మహేష్ సినిమా రాజమౌళికి సవాలు విసురుతుందా??

Increasing expectations day by day on Mahesh Babu and Rajamouli Movie

Mahesh – Rajamouli Movie :  దర్శకధీరుడు రాజమౌళి ప్రజెంట్ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీని ఇంటర్నేషనల్ గా వివిధ రకాలుగా ప్రమోట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆస్కార్ టార్గెట్ గా అమెరికాలోనే మకాం వేసి RRR సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. కానీ రాజమౌళికి మాత్రం అదో సవాల్ గా మారింది.

RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా అవార్డుల పంట పండిస్తోంది. దీంతో అదే టైమ్ లో రాజమౌళి నెక్స్ట్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు తో జక్కన్న ఎలాంటి సినిమా తీస్తాడు? ఏ రేంజ్ బడ్జెట్ పెడతాడు? స్టోరీ అండ్ స్ర్కీన్ ప్లే ఇంకే రేంజ్ లో ఉంటాయి? అన్న విషయాలు మరింత ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం మహేశ్ 29వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా స్ర్కిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులు విజయేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ షూట్ లో ఉన్నాడు. ఈ సినిమా షూట్ అయ్యాక రాజమౌళి షూట్ లో జాయిన్ అవ్వొచ్చని సమాచారం. మహేష్ – రాజమౌళి సినిమా సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని గ్లోబల్ యాక్షన్ అడ్వంచర్ గా ఉండబోతుందని రాజమౌళి చెప్పాడు. పదేళ్ళ నుంచి ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నట్టు రాజమౌళి చెప్పాడు. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ అండ్ అడ్వంచరస్ మూవీగా రూపొందబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ తో ఒప్పందం చేసుకున్నారు.

HariHara Veeramallu : హరిహర వీరమల్లు టీజర్ ఆ రోజేనా? పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్??

రాజమౌళి సినిమా ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లడంతో US ఫిల్మ్ మేకింగ్ కు, ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ కు చాలా తేడా ఉంది. అందుకే ఈ సినిమా ఎలా చేయాలి, ఏం చేయాలి, హాలీవుడ్ స్థాయిలో ఎలా నిర్మించాలి అనేది రాజమౌళికి సవాల్ గా మారింది. అందులోను మహేశ్ బాబుకి ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబోతోంది. దీంతో అటు మహేష్ అభిమానుల నుంచి కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన రాజమౌళి నెక్స్ట్ మహేష్ సినిమాని ఇంకెంత గ్రాండ్ గా తెరకెక్కిస్తాడో, ఈ సినిమా రాజమౌళికి ఎలాంటి సవాళ్లు విసురుతుందో చూడాలి.