Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే! India audience eye on south, All hopes are on these South Upcoming Movies

Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!

2022లో ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. ప్రశాంత్ నీల్, జక్కన్నలైతే పాన్ ఇండియా రిలీజ్ లతో ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వరల్డ్ వైడ్ సౌత్ సత్తా చాటారు.

Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!

Upcoming Movies: 2022లో ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. ప్రశాంత్ నీల్, జక్కన్నలైతే పాన్ ఇండియా రిలీజ్ లతో ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వరల్డ్ వైడ్ సౌత్ సత్తా చాటారు. గతేడాది అఖండ, పుష్ప కూడా కమర్షియల్ సక్సెస్ కొట్టినవే. అయితే ఇప్పుడు అందరి దృష్టి నెక్ట్స్ రానున్న సౌత్ సినిమాలపైనే. మరో క్రేజీ సౌత్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అని వరల్డ్ వైడ్ ఉన్న ఇండియన్ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

Telugu Upcoming Movies: హీరోయిన్ల కొరత.. అప్షన్లు తెగ వెతికేస్తున్న మేకర్స్!

కోవిడ్ తర్వాత విపరీతంగా.. ఎవ్వరూ ఊహించని విధంగా సౌత్ సినిమాలు సక్సెస్ జెండా ఎగిరేసాయి. కేజీఎఫ్2 లాంటి సినిమా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురుపిస్తూనే ఉంది. ట్రిపుల్ ఆర్, పుష్ప లాంటి సినిమాలు నార్త్ ఆడియెన్స్ ను బాగానే అలరించాయి. అఖండ, బంగార్రాజు, భీమ్లానాయక్ లాంటి రీజనల్ మూవీస్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అనిపించుకున్నాయి. వలిమై, బీస్ట్ తమిళనాడులో, జేమ్స్ కి కర్ణాటకలో మంచి ఆదరణే దక్కింది. ఇక నెక్ట్స్ సౌత్ నుంచి రానున్న సినిమాలపై ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది.

Upcoming Movies: ఒక హీరో కోసం రాసిన కథ.. మరో హీరోతో సినిమా!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా, శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈమధ్యే ఇంటెన్స్ లవ్ స్టోరీ సెట్స్ పైకెళ్లింది. షూటింగ్ కూడా యమా స్పీడ్ గా సాగుతోంది. పవన్ హిట్ టైటిల్ ఖుషి పేరుతోనే ఈ సినిమా రాబోతుంది. ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్ 23న ఖుషిని రిలీజ్ చేస్తున్నట్టు వెరీ రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో రౌడీబాయ్ ఖుషి విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తోన్నా.. సౌత్ సినిమాగానే ముందుకొస్తున్న సినిమా లైగర్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. పూరీ కనెక్ట్స్ తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ న తెరకెక్కిస్తోంది. తెలుగు, హిందీ భాషలలో డైరెక్ట్ గా తమిళ్, మలయాళ, కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. 180 కోట్ల బడ్జెట్ తో తయారవుతోన్న లైగర్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆడియెన్స్ పుష్ప ది రూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీక్వెల్ ను మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ నుంచి సెట్స్ పైకెళ్లనుందని టాక్. పుష్ప.. అంచనాలు లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అందరి దృష్టి తీయబోయే పుష్ప పార్ట్ 2 పైనే వుంది. అందుకు తగ్గట్టే ఆ సినిమా కి మేకర్స్ 400 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.

Upcoming Movies : ఈ సినిమాలన్నీ పూర్తయ్యేదెప్పుడు..?

చిరంజీవి మోహన్ రాజా కాంబినేషన్ లో వస్తున్న మలయాళ రీమేక్ సినిమా గాడ్ ఫాదర్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కతోన్న ఈ మూవీని ఆగస్టు 12న రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. సల్మాన్ ఖాన్, నయనతార వంటి స్టార్స్ ఉండటంతో గాడ్ ఫాదర్ పాన్ ఇండియా లెవెల్ చూపించినా ఆశ్చర్యం లేదు. సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తోన్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, నోరాఫతేహీ లేడీ లీడ్స్ గా కనిపించబోతున్నారు.

Postponed Movies: అటకెక్కిన సినిమాలు.. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం!

అన్నింటికి మించి సౌత్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న క్రేజీ సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ అదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 2023 సంక్రాంతికి ఆదిపురుష్ ని తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా. 350 కోట్లు బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ సలార్ రూపొందుతోంది. ఇప్పటికీ 40 పర్సెంట్ షూట్ అయ్యింది. ఈ సినిమా 2023 సమ్మర్ లో విడుదల కానుంది. ఇక 550 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్, దీపికా, అమితాబ్ వంటి స్టార్ కాస్ట్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్ట్ కె 2023 ఎండింగ్ కానీ 2024 సంక్రాంతి కి గానీ రిలీజ్ కానుంది.

High Budget Movies: నిర్మాతలకు షాక్ కొట్టే సినిమా బడ్జెట్.. ఎందుకిలా పెరిగిపోతుంది?

మోస్ట్ అవైటైడ్ లిస్ట్ లో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ కూడా ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటిభాగం ఈ సెప్టెంబర్ లోనే థియేటర్స్ కి రానుంది. ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తీ, త్రిషా వంటి భారీ తారాగణంతో మణిరత్నం తీస్తున్న హిస్టారికల్ ఫిల్మ్ హిందీ మార్కెట్ లోనూ సత్తా చాటుతుందనే అంచనాలున్నాయి. సమంతా నటించిన రెండు సినిమాలు మంచి బజ్ నే క్రియేట్ చేస్తున్నాయి. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన శాకుంతలంలో పాటూ యశోద సినిమాపైనా ఆడియెన్స్ కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కన్నడ స్టార్ సుదీప్ విక్రాంత్ రోణా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కానుంది. కేజీఎఫ్ లా ఈ కన్నడ మూవీని నేషనల్ వైడ్ రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు సుదీప్.

×