Pan India Movies: ఇండియా సినిమా కేరాఫ్ టాలీవుడ్.. మ్యాజిక్ చేస్తున్న మలయాళం!

టాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు తయారైంది. శాండిల్ వుడ్ కూడా సంకెళ్లు తెంచుకుంది. మలయాళీ ఇండస్ట్రీ సైతం గిరి గీసుకుని లేదు.

Pan India Movies: ఇండియా సినిమా కేరాఫ్ టాలీవుడ్.. మ్యాజిక్ చేస్తున్న మలయాళం!

Tollywood

Pan India Movies: టాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు తయారైంది. శాండిల్ వుడ్ కూడా సంకెళ్లు తెంచుకుంది. మలయాళీ ఇండస్ట్రీ సైతం గిరి గీసుకుని లేదు. ఇలా సౌత్ ని చూసి బాలీవుడ్ కి చెమటలు పడుతున్నాయిప్పుడు. కానీ అన్ని రకాలుగా ప్లస్ లుంచుకుని నార్త్ మేకర్స్ తలదన్నేలా కోలీవుడ్ లీడ్ తీసుకోలేకపోతుంది. అది వదిలేస్తే అసలు సౌత్ లోని పక్క రాష్ట్రాల వారిని మెప్పించడలో కూడా తమిళ్ స్టార్స్ తడబడుతున్నారు.

Pan India Movies: స్క్రీన్ స్పేస్ ప్లీజ్.. తెలుగు సినిమాపై బాలీవుడ్ అలక?

బాహుబలితో నేషనల్ టార్గెట్ కి బాటలు పరిచాడు రాజమౌళి. బాహుబలి2తో బాలీవుడ్ నివ్వెరపోయే రికార్డులను కొట్టాడు. ట్రిపుల్ ఆర్ తో మరోసారి సత్తా చాటి జక్కన్న మార్క్ చూపించాడు. ఈ డైరెక్టర్ నార్త్ లో పరిచయ చేసిన టాలీవుడ్ స్టార్ ప్రభాస్… గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. బిగ్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్… అంతకుమించిన టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు డార్లింగ్. తారక్, చరణ్ కూడా ఇండియన్ స్టార్స్ అయిపోయారు. గతంలో కూడా మగధీర, ఈగ లాంటి సినిమాలతో తనవైపు ఫోకస్ తిప్పుకునేలా చేసిన రాజమౌళి నెక్ట్స్ సినిమా ఎప్పుడొస్తుందా అని వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

Pan India Movies: అప్‌నే టైమ్ ఆగయా.. బాలీవుడ్ బెండు తీస్తున్న సౌత్ మూవీస్!

పుష్ప.. అసలు ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా నార్త్ లో అడుగు పెట్టి కోట్లను రాబట్టాడు. అంతకుమించిన క్రేజ్ ను ఐకాన్ స్టార్ దక్కించుకున్నాడు. సుకుమార్ కంటెంట్ కు సౌత్ టు నార్త్ ఆడియెన్స్ దాసోహమన్నారు. పుష్ప2 కోసం ఇప్పుడందరూ ఎదురుచూస్తున్నారంటే బన్నీ, సుక్కూ కలిసి సృష్టించిన మ్యానియానే. సరైన కథను అంతే పవర్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో తీసుకొస్తే అక్కడా.. ఇక్కడా అని తేడా లేకుండా ఎలా మెప్పించవచ్చో పుష్ప మేకర్స్ చేసి చూపించారు.

Pan India Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. మెప్పించడం అంత ఈజీకాదు!

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెజీఎఫ్ ఫ్రాంచైజ్ గురించి. చాప్టర్ 1తో ఇంట్రెస్ట్ పుట్టించి.. చాప్టర్ 2తో కనివినీ ఎరుగుని రికార్డులను చాలా ఈజీగా కొల్లగొట్టేస్తున్నారు ప్రశాంత్ నీల్, యశ్. మొదటి నుంచి శాండిల్ వుడ్ ఇండస్ట్రీ సినీప్రపంచానికి చాలా దూరంగానే ఉంటుంది. చాలామంది కన్నడ దర్శకులు కనీసం మేము పోటీ పడగలమనే నమ్మకాన్ని చూపించడానికి కూడా పెద్దగా సాహసించలేదు. టాలీవుడ్, కోలీవుడ్ లలో హిట్టైన సినిమాలను రీమేక్ చేసి వదిలేస్తే చాలని నమ్మినవారే అక్కడ ఎక్కువ. కానీ ఓ కన్నడ సినిమా కర్ణాటక బార్డర్.. కాదు కాదు ఇండియా బార్డర్ దాటి కాలర్ ఎగిరేస్తుందంటే అది ప్రశాంత్ నీల్, యశ్ కన్న కల.

Pan India Movies: టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్.. కుళ్ళుకుంటున్న బాలీవుడ్!

మలయాళ ఇండస్ట్రీ తక్కువేమీ కాదు. ఫస్ట్ నుంచి అక్కడ కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. భారీ బడ్జెట్ పెట్టి హై ఎండ్ టఫ్ సినిమాలను మలయాళీ మేకర్స్ తీయకపోవచ్చు. కానీ కథే కింగ్ గా కేరళ మేకర్స్ చేసిన మ్యాజిక్ కి వరల్డ్ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఎన్నో మలయాళీ సూపర్ హిట్స్.. అన్ని భాషల్లో రీమేక్ అయ్యాయి. అవుతున్నాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్, లూసిఫర్, హెలెన్, నాయట్టు, డ్రైవింగ్ లైసెన్స్.. వంటి వాటిపై టాలీవుడ్, బాలీవుడ్ రీమేక్ లు వస్తున్నాయంటే అక్కడి కంటెంట్ వ్యాల్యూను అర్ధం చేసుకోవచ్చు. ఇక దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, ఫృధ్వీరాజ్ లాంటి వాళ్లు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా సినిమాలతో ఆడియెన్స్ అటెక్షన్ గ్రాబ్ చేస్తున్నారు.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

ఎటొచ్చి తేడా కొడ్తోంది తమిళ ఇండస్ట్రీతోనే. ఎవరో కాదు… కోలీవుడ్ ప్రేక్షకుల్లోనే అరే… మన వాళ్లకు ఏమైంది అనే డిబేట్ నడుస్తోంది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ తో పాటూ రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు మన దగ్గర లేరా అని చర్చించుకుంటున్నారు. ఎక్కడ లాజిక్ మిస్ అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య యూనిటీ లేదని ఒకరు… మూస మైండ్ నుంచి బయటికి రావట్లేదని మరొకరు… ఇలా రకరకాలుగా తమిళ్ సినిమా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు.