Indian Movies In Russia : రష్యాలో భారత్ సినిమాలకు ఫుల్ క్రేజ్ .. హాలీవుడ్‌ సినిమాలు వద్దు ఇండియా సినిమాలే ముద్దు అంటున్న రష్యన్లు

రష్యాలో మన సినిమాలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సౌత్, నార్త్‌ అని తేడా లేకుండా ఇండియన్‌ సినిమా అంటే చాలు రష్యన్లు పడిచస్తారు. ఇక రాజ్‌ కుమార్ పేరెత్తితే చెవి కోసుకుంటారు. మన సినిమాలన్నా.. మన నటులన్నా.. అక్కడి వారికి చాలా ఇష్టం. ఎప్పుడైతే యుక్రెయిన్‌తో యుద్ధం మొదలైందో.. అప్పట్నుంచి మన సినిమాలకు క్రేజ్‌ మరింతగా పెరిగింది. హాలీవుడ్‌ సినిమాలను పక్కన పెట్టి మరీ మన సినిమాలే చూస్తున్నారు రష్యన్లు. ఇప్పుడు పుష్ప సినిమా కోసం ఎంతో అతృతగా వెయిట్ చేస్తున్నారు.

Indian Movies In Russia : రష్యాలో భారత్ సినిమాలకు ఫుల్ క్రేజ్ .. హాలీవుడ్‌ సినిమాలు వద్దు ఇండియా సినిమాలే ముద్దు అంటున్న రష్యన్లు

Indian films are still popular in Russia..

INDIA Movies In Russia : రష్యాలో మన సినిమాలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సౌత్, నార్త్‌ అని తేడా లేకుండా ఇండియన్‌ సినిమా అంటే చాలు రష్యన్లు పడిచస్తారు. ఇక రాజ్‌ కుమార్ పేరెత్తితే చెవి కోసుకుంటారు. మన సినిమాలన్నా.. మన నటులన్నా.. అక్కడి వారికి చాలా ఇష్టం. ఎప్పుడైతే యుక్రెయిన్‌తో యుద్ధం మొదలైందో.. అప్పట్నుంచి మన సినిమాలకు క్రేజ్‌ మరింతగా పెరిగింది. ఎంతలా అంటే హాలీవుడ్‌ సినిమాలను పక్కన పెట్టి మరీ మన సినిమాలే చూస్తున్నారు రష్యన్లు. ఇప్పుడు పుష్ప సినిమా కోసం ఎంతో అతృతగా వెయిట్ చేస్తున్నారు.

భారత్ -రష్యా సంబంధాల గురించి మాట్లాడితే బాలీవుడ్‌ను ప్రస్తావించకుండా ఉండలేం. కొందరికి ఇది వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఇరు దేశాల సంబంధాలపై బాలీవుడ్ ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది. ఇక్కడి సినీ సూపర్ స్టార్లు రాజ్ కపూర్, నర్గీస్, మిథున్ చక్రవర్తి వంటి వారు రష్యాలో కూడా సూపర్ స్టార్లే. షోలే, కభీ కభీ, దో అంజానే, రాజా రాణి లాంటి బాలీవుడ్ చిత్రాలు సోవియట్‌లో చాలా పాపులర్. ఆ క్లాసిక్ మూవీలు ఏదో ఒక థియేటర్‌లో ఆడుతూనే ఉంటాయి. సోవియట్‌ యూనియన్, భారత్ సంబంధాలలో హిందీ చిత్రాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎన్నో సినిమాల చిత్రీకరణ రెండు భాషలలో ఒకేసారి జరిగింది. ఒకేసారి విడుదలయిన చిత్రాలూ చాలానే ఉన్నాయి. ఈనాటికీ అక్కడ పాత చిత్రాల నటీనటులకు క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడైతే భారీ బడ్జెట్‌ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో దేశం అవతల ఎక్కడ సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా.. రష్యాలో మాత్రం పక్కాగా రిలీజ్ అయ్యేది. అయితే కొన్నాళ్లుగా రష్యాలో బాలీవుడ్ సినిమాలపై కొంతమేర క్రేజ్‌ తగ్గింది. హాలీవుడ్ సినిమాలకు పాపులారిటీ పెరిగింది. అయితే.. యుక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా, బ్రిటన్ .. రష్యాతో సంబంధాలు తెంచుకోవడంతో హాలీవుడ్ మూవీస్ ఎంట్రీకి బ్రేక్ పడింది. దీంతో.. మళ్లీ ఇండియన్ మూవీసే బెస్ట్ అంటూ మనవైపు టర్న్ అయ్యారు రష్యన్స్‌..

బాహుబలి, రాధే శ్యామ్‌, కేజీఎఫ్‌, గార్గి సినిమాలు అక్కడ ఓ రేంజ్‌లో ఆడాయి. మన దగ్గర హిట్టా ఫ్లాపా అన్నది నథింగ్‌. అక్కడ మాత్రం మన సినిమాలకు ఉన్న క్రేజ్‌ వేరే స్థాయిలో కనిపిస్తోంది. ఎక్కువగా ఇండియన్ సినిమాల సందడి మాస్కోలో కనిపిస్తుంది.సినిమా పార్క్‌, ఫార్ములా కినో, ప్రీమియర్ హాల్, కినోమాక్స్‌ అండ్ కరో థియేటర్స్‌లో ఎక్కువగా మన సినిమాల సందడే కనిపిస్తుంది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం.. సినిమాలే కాదు బెంగాళీ గుజరాతీ సినిమాలకు కూడా అక్కడున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజైతే చాలు థియేటర్ ఆటోమేటిక్‌గా ఫుల్ అయిపోతుంది. ఇక అంతేకాదు మన బాలీవుడ్‌ పాటలకు కూడా అక్కడ పిచ్చపిచ్చగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎప్పటికప్పుడు హిందీ సాంగ్స్‌ పెట్టుకుని మాస్కో వీధుల్లో ఫ్లాష్‌ మాబ్స్‌ కూడా చేస్తుంటారు. రష్యన్లు డ్యాన్సులతో అదరగొడుతుంటారు.

రిలీజై నెలలు గడుస్తున్నా పుష్ప సినిమాకు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్‌గా ఈ సినిమాను మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన చిత్రాల కేటగిరిలో పుష్ప తెలుగు వర్షన్‌ సినిమాను ఇంగ్లీష్‌, రష్యన్‌ సబ్‌ టైటిల్స్‌తో ప్రదర్శించారు. త్వరలో పుష్ప సినిమాను రష్యన్‌లో డబ్బింగ్‌ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా రష్యన్ వెర్షన్‌ కోసం అక్కడి వారు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా యుక్రెయిన్‌తో రష్యా యుద్ధం మనకు ఇలా కలిసొచ్చింది. ఇటు తక్కువ ధరకు చమురు, అటు రష్యాలో మన సినిమాలకు మరింత క్రేజు..! ఓ రకంగా యుక్రెయిన్ యుద్ధం రష్యాను ప్రపంచానికి దూరం చేస్తే. .మనకు మాత్రం మరింత దగ్గర చేసింది.