‘‘ఇండియన్ 2’’ ప్రమాదంనుండి కమల్, కాజల్ తృటిలో ఎలా తప్పించుకున్నారంటే!

ఇండియన్ 2 - ప్రమాదం నుంచి కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ ఎలా తప్పించుకున్నారో వివరించిన కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అమృతరామ్‌..

  • Published By: sekhar ,Published On : February 20, 2020 / 10:07 AM IST
‘‘ఇండియన్ 2’’ ప్రమాదంనుండి కమల్, కాజల్ తృటిలో ఎలా తప్పించుకున్నారంటే!

ఇండియన్ 2 – ప్రమాదం నుంచి కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ ఎలా తప్పించుకున్నారో వివరించిన కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అమృతరామ్‌..

ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమా షూటింగ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదం నుంచి హీరో కమల్‌హాసన్‌, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరగడానికి 10 సెకన్ల ముందు వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ విషయాన్ని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అమృతరామ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఘోర ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాం. 10 సెకన్ల తేడాతో క్రేన్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాం. మీ ఆశీర్వాదాల కారణంగానే కమల్‌ సార్‌, కాజల్‌, నేను సురక్షితంగా ఉన్నాం. మేము బస చేసిన టెంట్‌పైనే భారీ క్రేన్‌ కూలిపోయింది. మేమంతా క్షేమంగా ఉన్నాం.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సహచరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని అమృత ట్వీట్‌ చేశారు. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

ఈ దుర్ఘటనలో ముగ్గురు మంచి సాంకేతిక నిపుణులను పోగొట్టుకున్నామని లైకా ప్రొడక్షన్స్‌ తెలిపింది. సహాయ దర్శకుడు కృష్ణ, ఆర్ట్‌ అసిసెంట్‌ చంద్రన్‌, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ చంద్రన్‌ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరగడం తమను ఎంతోగానో బాధించిందని ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Indian 2

Indian Accident

Read More>>పోర్న్ ఇండస్ట్రీలో స్టార్ అవుతానంటున్న స్పీల్ బర్గ్ డాటర్