Indian 2 : సౌత్ ఆఫ్రికాకు పయనమైన లోకనాయకుడు.. ఇండియన్ 2 షెడ్యూల్..

1996లో తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు(ఇండియన్) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 26 సంవత్సరాల తర్వాత 2022 లో ఈ సినిమాకి సీక్వెల్ మొదలుపెట్టారు. కానీ కొంతభాగం షూట్ చేసి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ శరవేగంగా..........

Indian 2 : సౌత్ ఆఫ్రికాకు పయనమైన లోకనాయకుడు.. ఇండియన్ 2 షెడ్యూల్..

Indian 2 shooting schedule 15 days planning in Africa

Indian 2 :  కమల్ హాసన్ ఇటీవలే కొన్ని నెలల క్రితం విక్రమ్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి దాదాపు 450 కోట్ల కలెక్షన్స్ వసూలు చేశాడు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు చూస్తున్న కమల్ కి విక్రమ్ సినిమా భారీ విజయం ఇచ్చింది. దీంతో లోకనాయకుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. గతంలో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాని తిరిగి మళ్ళీ లైన్ లో పెట్టాడు.

1996లో తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు(ఇండియన్) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 26 సంవత్సరాల తర్వాత 2022 లో ఈ సినిమాకి సీక్వెల్ మొదలుపెట్టారు. కానీ కొంతభాగం షూట్ చేసి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఆల్రెడీ ఇండియన్ 2 షూటింగ్ ఏపీ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో, రామోజీఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తికాగా త్వరలోమరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.

Pathaan Collections : 700 కోట్ల దగ్గర ఆగిన పఠాన్.. నత్తనడకన 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా?

ఇండియన్ 2 సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆఫ్రికాకు వెళ్లనున్నారు. ఆఫ్రికాలో, అక్కడి అడవుల్లో చిత్రీకరణ చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 15 రోజులు జరగనుంది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ 2 సినిమాని 2023 చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.