Kajal Aggarwal : కాజల్‌ని లాంచ్ చేసిన కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుందిగా!

సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా కాజల్ ని లాంచ్ చేస్తూ..

Kajal Aggarwal : కాజల్‌ని లాంచ్ చేసిన కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుందిగా!

Indian 2 star Kajal Aggarwal launch beauty product kajal

Kajal Aggarwal Beauty Product : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రముఖ బిజినెస్‌ మేన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకొని ఒక బాబుకి కూడా జన్మనించిన కాజల్.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతుంది. ఇటీవలే ‘ఘోస్టీ’ అనే హారర్ కామెడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, హిందీ – తెలుగు భాషల్లో ఒకొక సినిమా చేస్తుంది. ఒక పక్క వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

Chatrapathi : ఛత్రపతి హిందీ కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా.. పాపం బెల్లంకొండ..

కంటికి పెట్టుకునే కాటుక (కాజల్) ని బ్యూటీ ప్రోడక్ట్ గా మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ కాజల్ తన సోషల్ మీడియా ద్వారా ప్రోడక్ట్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కాజల్ గతంలో తన భర్త గౌతమ్ ఇంటీరియర్ బిజినెస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా భాగం అయ్యిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్ లో.. కాజల్ అగర్వాలే రెండు చేతులతో సంపాదిస్తూ కొంచెం ముందు రేస్ లో ఉంది.

Sreeleela : సీనియర్, జూనియర్ హీరోలు ఎవర్నీ వదలట్లేదుగా

ఇక కాజల్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. కమల్ హాసన్ తో ఇండియన్ 2 (Indian 2), బాలకృష్ణ NBK108 సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఇండియన్ 2 ని శంకర్ డైరెక్ట్ చేస్తుంటే, NBK108ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)