Indian 2: భారతీయుడి కష్టాలు.. చెర్రీకి చిక్కులు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మోస్ట్ ఇండియన్ క్రేజీఎస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు.. హీరోల స్థాయిని ఆకాశానికి పెంచే సినిమా అవుతుందని ఇప్పటికే విశ్లేషకులు కూడా తేల్చేశారు.

Indian 2: భారతీయుడి కష్టాలు.. చెర్రీకి చిక్కులు?

Indian 2

Indian 2: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మోస్ట్ ఇండియన్ క్రేజీఎస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు.. హీరోల స్థాయిని ఆకాశానికి పెంచే సినిమా అవుతుందని ఇప్పటికే విశ్లేషకులు కూడా తేల్చేశారు. కనుక ఈ సినిమా తర్వాత ఆ క్రేజీని నిలబెట్టుకొనేలా ప్లాన్స్ కూడా హీరోలు ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

అందులో భాగంగానే రామ్ చరణ్ మరో ఇండియన్ టాప్ దర్శకుడు శంకర్ తో సినిమాకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. అయితే.. దర్శకుడు శంకర్ సినిమా కష్టాలు ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు చిక్కులుగా మారనున్నాయా అని చర్చలు జరుగుతుంది. కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

కరోనా సమయంలో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మ్యాటర్ లో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్, దర్శకుడు శంకర్ మధ్య సమన్వయం లోపించింది. రామ్ చరణ్ తో శంకర్ సినిమా ప్రకటించగానే లైకా సంస్థ శంకర్ మీద హైకోర్టుకెక్కింది.ఇండియన్ 2 సినిమా పూర్తిచేయకుండా మరో సినిమాకు ఎలా వెళ్తారని వేసిన పిటిషన్ పై కోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. లైకాతో శంకర్ కోర్టు వెలుపల పరిష్కారానికి అంగీకరించినా చర్చలు విఫలమై గురువారం కోర్టు విచారణ జరిగింది.

అయితే, మరో మూడు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. అంటే మరో మూడు వారాల తర్వాత కానీ ఈ సినిమాపై స్పష్టత రాదు. అప్పుడైనా శంకర్ ఇండియన్ ముందు మొదలుపెడతారా.. చరణ్ సినిమా షూటింగ్ చేస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. దీంతో ఇండియన్ సినిమాపై స్పష్టత వస్తే కానీ చెర్రీతో సినిమాపై స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.