Indian Actress: రెచ్చిపోతాం.. హాలీవుడ్‌లో ముద్దుగుమ్మల బోల్డ్ క్యారెక్టర్స్!

హాలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చేయడం అంత తేలికైన విషయం కాదు. అందులో హైప్ క్రియేట్ చేసే సబ్జెక్ట్ దొరకడం కూడా అదృష్టమే. ఇప్పుడు సమంతా అదే దక్కించుకుంది. బోల్డ్ క్యారెక్టర్ ను..

Indian Actress: రెచ్చిపోతాం.. హాలీవుడ్‌లో ముద్దుగుమ్మల బోల్డ్ క్యారెక్టర్స్!

Indian Actress

Indian Actress: హాలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చేయడం అంత తేలికైన విషయం కాదు. అందులో హైప్ క్రియేట్ చేసే సబ్జెక్ట్ దొరకడం కూడా అదృష్టమే. ఇప్పుడు సమంతా అదే దక్కించుకుంది. బోల్డ్ క్యారెక్టర్ ను సెట్ చేసుకుంది. సామ్ కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్స్ ఇలాగే హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రొమాంటిక్ సీన్స్ లో చెలరేగిపోయారు. మరిప్పుడు సమంతా బైసెక్సువల్ గా కనిపించబోతుంటే.. బాలీవుడ్ బిగ్ బ్యూటీస్ ఏం చేస్తున్నారు.

Star Actress: ఈడా ఉంటాం.. ఆడా ఉంటాం.. ఎక్కడైనా ఒకే అంటున్న స్టార్ బ్యూటీస్!

ఇన్ని రోజులు ఎందుకు, ఎలా ఆగాయో క్లారిటీ లేదు కానీ.. ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తుంది సమంతా. రీసెంట్ గా హాలీవుడ్ మూవీని కూడా ప్రకటించేసింది. అయితే ఏదో చిన్న చితకా క్యారెక్టరో.. లీడ్ రోల్ లో సింపుల్ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టో కాదు.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ స్టెప్ తీసుకుంది. అన్నింటికి మించి అన్న లెవెల్లో హాలీవుడ్ మూవీ కోసం బోల్డ్ రోల్ చేయబోతుంది. బైసెక్సువల్ గా ఇంటిమెంట్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుంది సమంతా.

Film Actress: హీరోయిన్స్ హార్డ్ వర్క్.. హీరోలతో సమానంగా స్టంట్లు!

హాలీవుడ్ డైరెక్టర్‌ ఫిలిప్‌ జాన్‌ డైరెక్ట్ చేస్తోన్న ‘అరెంజ్‌ మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ సినిమాకు సైన్ చేసింది సామ్. ఇండియన్ రైటర్ తిమేరి ఎన్‌ మురారీ రచించిన ‘అరెంజ్‌ మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ నోవెల్ ను బేస్ చేసుకుని ఈ మూవీ పట్టాలెక్కుతోంది. ఇందులోనే ఆమె బై సెక్సువల్‌గా బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది. గతంలో సూపర్‌ డీలక్స్‌, ఫ్యామిలీ మ్యాన్‌-2 సినిమాల్లో సమంత బోల్డ్‌ రోల్స్‌ లోనే కనిపించింది. వీటితో ఎంత పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుందో.. అంతే నెగెటివిటీని మూటగట్టుకుంది. అయితే ఇప్పుడామే ఫ్రీ బర్డ్.. కెరీర్ లో ఎదగాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ తో తనను ప్రూవ్ చేసుకోవాలనేది.. ఎవరి అడ్డూ లేకుండా ఆమె తీసుకున్న నిర్ణయం.

Bollywood Actress : బికినిలో అదర గొడుతున్న భామలు..

బాలీవుడ్‌ బిగ్ హీరోయిన్ గా ఉన్నప్పుడే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడా సత్తా చాటింది ప్రియాంక చోప్రా. నిక్‌ జొనాస్‌ తో పెళ్లయ్యాక ఇంటర్నేషనల్ స్టార్ గా ఫుల్ ఫామ్ లోకి వెళ్లింది. పెళ్లైనా సరే.. హాలీవుడ్ మూవీస్ లో రొమాంటిక్ సీన్స్ చేసేందుకు.. బోల్డ్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడట్లేదు ప్రియాంక. బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. క్వాంటికో ఇంగ్లీష్ టెలివిజన్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో కనిపించింది.

Katrina Kaif: క్యాట్-విక్కీ మ్యారేజ్ మిస్టరీ.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్!

వరుస హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో అక్కడ ఫుల్ బిజీగా మారింది ప్రియాంక చోప్రా. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. టెలివిజన్, వెబ్ సిరీస్, హాట్ వీడియో సాంగ్స్.. ఇలా పాపులరయ్యే ప్రతీ అంశాన్ని ఆమె కన్సిడర్ చేస్తుంది. అందుకే ఇప్పుడామే చేతిలో ది మ్యాట్రిక్స్ 4, టెక్ట్స్ ఫర్ యూ, సిటాడెల్ వంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఎక్స్ రిట‌ర్న్ ఆఫ్ ది జాండ‌ర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొణె. ఈ భామ మ‌రో హాలీవుడ్ ప్రాజెక్టుతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించ‌బోతుంది.

December Film Releases: ఇయర్ ఎండ్ సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోలదే!

అయితే ఈ సారి హీరోయిన్ గా క‌నిపించ‌డ‌మే కాకుండా హాలీవుడ్ మూవీ నిర్మాత‌గా కూడా మారింది. ఎస్‌ టీ ఎక్స్ ఫిలిమ్స్, టెంపుల్ హిల్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ తో దీపికా హాలీవుడ్ ఆడియెన్స్ కు కనెక్ట్ కానుంది. ఇందులో ఆమెది సూపర్ బోల్డ్ రోల్ అనే ప్రచారం జరుగుతుంది. రణ్ వీర్ తో పెళ్లికి ఏడాది ముందే ట్రిపుల్ ఎక్స్ కోసం హాలీవుడ్ యాక్టర్ విన్ డీజిల్ తో రొమాన్స్ చేసింది దీపికా. మరిప్పుడు ఏ స్టార్ తో అక్కడ రొమాన్స్ పండించబోతుందో తెలియాల్సి ఉంది.