Star Dupes : నెట్టింట వైరల్ అవుతున్న డూప్ స్టార్స్.. | Star Dupes

Star Dupes : నెట్టింట వైరల్ అవుతున్న డూప్ స్టార్స్..

ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీల డూప్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఈ విషయాలపై స్టార్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Star Dupes : నెట్టింట వైరల్ అవుతున్న డూప్ స్టార్స్..

Star Dupes: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వెనకట అనేవారు. ఏడుగురు మాట ఏమో కానీ.. సెలబ్రెటీలను పోలిన కామన్ పీపుల్ మాత్రం ఈమధ్య చాలా మంది కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Nazia Davison : అచ్చు నజ్రియాలా నజియా. పిక్స్ వైరల్..

సినిమా స్టార్స్‌కు డూప్‌లు ఉండటం కామన్.. అచ్చం.. హీరోల మాదిరి తయారయ్యి.. టీవీ షోస్ లో సందడి చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ సినిమా స్టార్స్ ఫీచర్స్‌తో ఉన్న కామన్ పీపుల్స్ మాత్రం రేర్‌గా కనిపిస్తుంటారు. వారి గురించి తెలిసినప్పుడు ఆ స్టార్స్ కూడా షాక్ అవుతుంటారు. అలాంటివారు చాలా మంది ఉన్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ విషయాలపై స్టార్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Bollywood Stars

రీసెంట్‌‌గా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఓ చిన్న వీడియో షేర్ చేశారు. బన్నీకి ఓ ధర్మ సందేహం వచ్చింది. తనలా ఉండేవారు ఎవరు ఉండి ఉంటారు అని. అనుకున్నదే తడవుగా సెర్చింగ్ మొదలు పెట్టాడు. అయితే ప్రపంచం అంతా వెతకడం కంటే.. సెలబ్రెటీస్‌లో తనలా ఎవరు ఉంటారా అని సెర్చ్ చేశాడు ఐకాన్ స్టార్. టాలీవుడ్ తరువాత తనను ఆదరించిన మాలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనలా ఎవరు ఉంటారూ అని సెర్చ్ చేయగా. మాలీవుడ్‌లో దాదాపు 90 సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు కుంచాకో బోబన్ ఫోటో వచ్చింది. ఇప్పుడీ వీడియో టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్ లో కూడా వైరల్ అవుతోంది.

రీసెంట్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పోలిక‌ల‌తో ఉన్న ఓ అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. అచ్చం కియారాలా కనిపిస్తున్న ఈ యంగ్ లేడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అయితే కియారాలా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య. ఈమె డెంటల్ డాక్టర్. కియారా ఫీచర్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుండటంతో.. ఈ అమ్మాయి వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

 

Kiara Advani

రీసెంట్‌గానే కాదు.. గతంలోకూడా సెలబ్రెటీల పోలీక‌లతో ఉన్నవారు చాలా మంది నెట్టింట్లో వైరల్ అయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్‌కు ఇటువంటి అనుభవాలు ఎక్కువ. బాలీవుడ్ స్టార్స్‌ను పోలిన కామన్ పీపుల్స్‌ను వెతికి మరీ ఫేమస్ చేస్తున్నారు ఫ్యాన్స్.

 

Dupes

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లకు డూప్‌లు ఎక్కువగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకో‌న్‌‌ను పోలిన అమ్మాయి బాలీవుడ్‌లోనే ఉంది. ఆమె పేరు మహిమా సునీత. ఈమె ఫేమస్ ప్రోఫెషనల్ డ్యాన్సర్.. ఇక బాలీవుడ్ టాలెస్ట్ బ్యూటీ కత్రీనా కైఫ్‌ను ప్రింటు తీసినట్టు ఉంటుంది అలీనా రాణీ అనే అమ్మాయి.. ఫేషియల్ ఫీచర్స్ .. హెయిర్‌తో పాటు హైట్‌లో కూడా కత్రీనాను పోలి ఉంది అలీనా రాణి. ఇద్దరినీ పక్కన పెట్టి చూస్తే.. ట్విన్స్ ఏమో అనుకుంటారు.

Katrina Kaif

ఎటు చూసినా.. అచ్చు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌లానే ఉంటుంది సాక్షీ అనే అమ్మాయి. సోషల్ మీడియా వీడియోల ద్వారా పాపులర్అయిన ఈ బ్యూటీ.. సారాను ప్రింట్ తీసి ఎదుట నిలబెట్టినట్టు ఉంటుంది. మరో వైపు ప్రీయాంకా చోప్రాను పోలి అమర్య డోంగ్రే అనే అమ్మాయి.. అచ్చం కాజోల్ లాగా పింకీ నేహా అనే అమ్మాయి.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలా.. బ్రిటీష్ నటి జూలియా మైఖెల్ ఇలా చాలా మంది బాలీవుడ్ స్టార్స్‌ను పోలినవారు ఉన్నారు. అంతెందకు మన సమంతలా ఉండబట్టే.. అషూ రెడ్డి సోషల్ మీడియా స్టార్ అయ్యింది. ఇలా ఇంకా చాలామంది స్టార్స్‌ను పోలిన కామన్ పీపుల్.. వారి పోలికలు ఉండటంతో.. సోషల్ మీడియా స్టార్స్ అవుతున్నారు..

Ashu Reddy : ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ.. అషు రెడ్డి వాళ్ల అమ్మ ఏం చెప్పిందంటే..

×