చియాన్ సినిమాలో ఇర్ఫాన్

‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా ద్వారా ప్రముఖ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు..

  • Published By: sekhar ,Published On : October 15, 2019 / 05:27 AM IST
చియాన్ సినిమాలో ఇర్ఫాన్

‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా ద్వారా ప్రముఖ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు..

‘చియాన్’ విక్రమ్ ప్రస్తుతం ‘ధృవనక్షత్రం’, ‘మహావీర్ కర్ణ’ సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైక్క నొడిగల్’ (తెలుగులో అంజలి సి.బి.ఐ) వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చెయ్యనున్నాడు. విక్రమ్ నటిస్తున్న 58వ సినిమా ఇది. ఈ సినిమాతో ప్రముఖ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోయే ఈ మూవీలో ఒక పవర్‌ఫుల్ అండ్  స్టైలిష్ యాక్షన్ రోల్ కోసం ఇర్ఫాన్‌ను సెలెక్ట్ చేసినట్టు దర్శకుడు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇర్ఫాన్ టర్కీకి చెందిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని, విక్రమ్ సినిమా ద్వారా ఇర్ఫాన్‌ను పరిచయం చేయడం హ్యాపీగా ఉందని నిర్మాతలు చెప్పారు. చియాన్ విక్రమ్ అంటే తనకు ఎంతో అభిమానమని, అలానే ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గారు పని చేస్తున్న ఈ సినిమాలో తాను కూడా భాగం కావడం అదృష్టం అని ఇర్ఫాన్ సంతోషం వ్యక్తం చేశారు.

Read Also : అరుణ్ ఖేతర్ పాల్ పాత్రలో వరుణ్ ధావన్

సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్.. వయాకామ్ 18 స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు.. ప్రియా భవానీ శంకర్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. సంగీతం : ఏఆర్ రెహమాన్, కెమెరా : శివకుమార్ విజయన్, ఆర్ట్ : అమరన్. 2020 ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.