Kartheeka Deepam: కార్తీకదీపం ఇండియన్ రికార్డు.. వారెవ్వా.. ట్విస్ట్‌లు మాములుగా లేవుగా!

కార్తీకదీపం.. వంటలక్క.. డాక్టర్ బాబు.. తెలుగు ప్రజలకు వెయ్యి రోజులకు పైగా ప్రతీరోజూ వినిపిస్తున్న, చర్చించుకుంటోన్న పేర్లు. వెయ్యి ఎపిసోడ్‌లు ఓ సిరియల్ రికార్డ్ టీఆర్‌వీతో నడవడం అంటే మామూలు విషయం కాదు..

Kartheeka Deepam: కార్తీకదీపం ఇండియన్ రికార్డు.. వారెవ్వా.. ట్విస్ట్‌లు మాములుగా లేవుగా!

Karthika Deepam

Indian Record of Kartheeka Deepam: కార్తీకదీపం.. వంటలక్క.. డాక్టర్ బాబు.. తెలుగు ప్రజలకు వెయ్యి రోజులకు పైగా ప్రతీరోజూ వినిపిస్తున్న, చర్చించుకుంటోన్న పేర్లు. వెయ్యి ఎపిసోడ్‌లు ఓ సిరియల్ రికార్డ్ టీఆర్‌వీతో నడవడం అంటే మామూలు విషయం కాదు.. ఇప్పటికీ బోర్ కొట్టించకుండా.. ఇండియన్ రికార్డ్‌ను కూడా కైవసం చేసుకున్న సీరియల్‌గా కార్తీకదీపం రికార్డులకు ఎక్కింది. ఏ సీరియల్‌కీ అందనంత దూరంలో రేటింగ్‌ను రాబడుతున్న ఈ సీరియల్ 21.10టీఆర్‌పీతో దేశంలోనే నెం.1 సీరియల్‌గా నిలిచింది.

ఈ రికార్డ్ కార్తీకదీపం సీరియల్‌కు కొత్తేంకాదు.. ఇప్పటికే 20.8పాయింట్లతో ఈ సీరియల్ నెం.1 స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును మళ్ళీ అదే సీరియల్ క్రాస్ చేసింది. 21.1 రేటింగ్‌తో టాప్‌లో నిలిచింది. ఈ విషయాన్ని నిరుపమ్ పరిటాల ఫ్యాన్స్ పేజ్‌లో అభిమానులు షేర్ చేయగా.. సీరియల్‌లో వంటలక్క పాత్రదారి ప్రేమి విశ్వనాథ్ తన ఫేస్ బుక్ స్టోరీగా పెట్టుకుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడు సడెన్‌గా కార్తీకదీపం సీరియల్‌ను ఇంతమంది చూడడానికి కారణం ఏమింటంటే..? ఎన్నో ఏళ్లుగా దీప క్యారెక్టర్ మీ అనుమానంతో అనుమానిస్తూ వస్తున్న డాక్టర్ బాబు నిజం తెలుసుకోవడం.. వెంటనే మోనీత అనే క్యారెక్టర్ ప్రెగ్నెంట్ కావడమే.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించనిది అని అందుకే.. ఒక్కసారిగా టీఆర్‌పీ రేటింగ్ పెరిగిపోయింది అంటున్నారు.

Karthil

ఉత్కంఠగా సాగుతోన్న కార్తీకదీపం.. ఇప్పటికే మూడున్నరేళ్లు నుంచి వస్తూనే ఉంది. 1058ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. ఇంకేముంది త్వరలో శుభం కాటు పడిపోద్దిలే డాక్టర్‌ బాబుకు నిజం తెలిసిపోయింది అనుకునేలోపే కొత్త ట్విస్ట్.. మోనీత డాక్టర్ బాబు కారణంగా ప్రెగ్నెంట్ అంటూ ట్విస్ట్. డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోతారు అనుకునేలోపే.. మోనిత ప్రెగ్నెంట్ ట్విస్ట్‌ వచ్చేసరికి.. దేశంలోనే నెంబర్ 1 సీరియల్‌గా నాలుగున్నర కోట్ల మంది వీక్షిస్తున్న అతిపెద్ద సీరియల్‌గా రికార్డులకు ఎక్కేసింది ఈ సీరియల్.