Indiana Jones 5 : అడ్వెంచర్ యాక్షన్ సీన్స్‌తో ఇండియానా జోన్స్ లాస్ట్ సిరీస్ ట్రైలర్..

వరల్డ్ వైడ్ గా 'ఇండియానా జోన్స్' సినిమా సిరీస్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అడ్వెంచర్ సినిమాలకు ఇది ఒక గైడ్ లాంటిది. 1981లో మొదలైన ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్స్ సిరీస్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. తాజాగా దాదాపు 15 సంవత్సరాలు తరువాత ఇప్పుడు ఈ సిరీస్ నుంచి లాస్ట్ సినిమా రాబోతుంది.

Indiana Jones 5 : అడ్వెంచర్ యాక్షన్ సీన్స్‌తో ఇండియానా జోన్స్ లాస్ట్ సిరీస్ ట్రైలర్..

Indiana Jones 5 trailer out

Indiana Jones 5 : వరల్డ్ వైడ్ గా ‘ఇండియానా జోన్స్’ సినిమా సిరీస్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అడ్వెంచర్ సినిమాలకు ఇది ఒక గైడ్ లాంటిది. 1981లో మొదలైన ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్స్ సిరీస్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్(1981), ది టెంపుల్ అఫ్ డూమ్(1984), ది లాస్ట్ క్రూసేడ్(1989), ది కింగ్డన్ అఫ్ ది క్రిస్టల్ స్కల్(2008).. ఈ నాలుగు సినిమాలకు ‘స్టీవెన్ స్పీల్బర్గ్’ దర్శకత్వం వహించాడు.

Shah Rukh Khan : మక్కాలో షారుఖ్ ఖాన్ ‘ఉమ్రా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..

తాజాగా దాదాపు 15 సంవత్సరాలు తరువాత ఇప్పుడు ఈ సిరీస్ నుంచి లాస్ట్ సినిమా రాబోతుంది. ‘ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ అఫ్ డెస్టినీ’ అనే టైటిల్ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. ముందు భాగాలు తరహాలోనే ఈ భాగం కూడా ఖచ్చితంగా అందరికీ ట్రీట్‌ ఇచేలా ఉంటది అనడంలో సందేహం లేదు.

కాగా ఈ లాస్ట్ సిరీస్ కి ‘స్టీవెన్ స్పీల్బర్గ్’ బదులు ‘జేమ్స్ మాన్‌గోల్డ్’ దర్శకత్వం వహించాడు. ఇక ముందు నాలుగు భాగాల్లో నటించిన ‘హారిసన్ ఫోర్డ్’ ఈ సినిమాలోను నటిస్తున్నాడు. 80 ఏళ్ళ వయసులో కూడా హారిసన్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు కూడా ట్రైలర్ ద్వారా ప్రకటించేశారు మేకర్స్.