ఐదు భాషల్లో రిలీజ్‌కి రెడీ అవుతోన్న ‘మడ్డీ’

ఐదు భాషల్లో రిలీజ్‌కి రెడీ అవుతోన్న ‘మడ్డీ’

కొత్తరకం కథలను భాషాభేదం లేకుండా ప్రేక్షకులు ఆదిరస్తూనే ఉన్నారు. ఓటీటీ విస్తృతంగా విస్తరించిన తర్వాత.. భాషాభేదం లేకుండా ప్రతీ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా మూవీగా.. 5 భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది మడ్ రేస్ మూవీ ‘మడ్డీ’. ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం `మడ్డీ` ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని ఇవ్వనున్నట్లు చిత్రయూనిట్ చెబుతోంది. ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రగభల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌ం అవుతున్నారు.

పీకే 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ‌ కృష్ణదాస్ నిర్మాణంలో.. తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ మ‌రియు మలయాళ భాష‌ల‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌‌ను చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది. రియ‌లిస్టిక్ విజువ‌ల్స్‌తో ఎంతో గ్రాండియ‌ర్‌గా విడుదలైన మోష‌న్ పోస్ట‌ర్‌కి 2మిల‌య‌న్స్‌కి పైగా వ్యూస్‌ రాగా.. సోష‌ల్ మీడియాలో సినిమాపై చర్చ జరుగుతోంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌ను ఫిబ్రవరి 26న విడుద‌ల చేయ‌నున్నారు.

రియలిస్టిక్ యాక్షన్ రేసింగ్‌తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ‘మడ్డీ’ సినిమా రూపొందగా..
మోషన్ పోస్టర్‌లోని విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా, రియలిస్టిక్ గా ఉండగా.. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం రియ‌ల్ మ‌డ్ రేస‌ర్స్ పని చేయగా.. ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమా పరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాని రూపొందించినట్లు చెప్పాడు ద‌ర్శ‌కుడు డాక్టర్ ప్రగభల్.

రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిట‌ర్ కాగా.. హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. పాపులర్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ మడ్ రేసింగ్ యాక్షన్ ఫిల్మ్ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.