ఎన్టీఆర్‌కి అభిమానిని.. రామ్‌చరణ్‌ నటన బాగుంది: ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రశంసలు

  • Published By: vamsi ,Published On : February 9, 2020 / 11:49 AM IST
ఎన్టీఆర్‌కి అభిమానిని.. రామ్‌చరణ్‌ నటన బాగుంది: ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రశంసలు

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌పై ప్రశంసలు కురిపించారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి. ఇటీవల తాను ‘రంగస్థలం’ సినిమా చూశానని, ఆ సినిమాలో రామ్‌చరణ్ నటన బాగుందంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధామూర్తి.. ఆ కార్యక్రమంలో తెలుగు సినిమాల గురించి మాట్లాడారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాల గురించి మాట్లాడుతూ.. తెలుగు సినిమాల గురించి మాట్లాడారు. 

చిన్ననాటి నుంచి నేను రామారావుగారి అభిమానిని అని, ఆయన సినిమాలు చాలా ఎక్కువగా చూసేదాన్ని అని, ఆయన నటించిన ‘మాయాబజార్‌’, ‘దాన వీర శూర కర్ణ’, ‘సీతా స్వయంవరం’ చిత్రాలను చూశాను. మనకి కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ, నా దృష్టిలో మాత్రం కృష్ణుడంటే ఎన్టీఆరే. ఎప్పుడైనా కళ్లు మూసుకుని కృష్ణుడిని స్మరిస్తే.. నాకు ఆయనే కనిపిస్తారు.

అలాగే ‘అన్నమయ్య’, ‘మనం’, ‘ఓం నమోవేంకటేశాయ’ వంటి సినిమాలు చూశాను. ఇటీవల ‘రంగస్థలం’ సినిమా చూశాను. సినిమా చాలా బాగుందని, ఆ సినిమాలో రామ్‌చరణ్ నటన అద్భుతంగా ఉందని సుధామూర్తి చెప్పారు.