MAA : మంచు విష్ణు చెప్పే గుడ్‌న్యూస్‌పై ‘మా’లో ఆసక్తి

ఒకే ఒక్క ట్వీట్‌.. ఇప్పుడు టోటల్‌ తెలుగు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. 24 క్రాఫ్ట్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అందరూ ఆ ట్వీట్‌పైనే చర్చించుకుంటున్నారు.

MAA : మంచు విష్ణు చెప్పే గుడ్‌న్యూస్‌పై ‘మా’లో ఆసక్తి

Manchu Vishnu

Manchu Vishnu good news : ఒకే ఒక్క ట్వీట్‌.. ఇప్పుడు టోటల్‌ తెలుగు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. 24 క్రాఫ్ట్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అందరూ ఆ ట్వీట్‌పైనే చర్చించుకుంటున్నారు. ఇవాళ గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ ట్వీట్‌ చేశారు మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు. దీంతో మంచు విష్ణు ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ గుడ్‌న్యూస్‌ ఏమై ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు.

ఎన్నికల్లో గెలిపిస్తే మాకు సొంత బిల్డింగ్‌ కట్టిస్తానని మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఖర్చంతా తానే పెట్టుకుంటానని కూడా ప్రకటించారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించే ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. మా బిల్డింగ్‌ నిర్మాణం కోసం రెండు, మూడు చోట్ల స్థలాలను కూడా చూశానని విష్ణు గతంలో ప్రకటించారు. వాటిలో ఒకటి ఫైనల్‌ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా బిల్డింగ్ పూర్తి చేసి తన హామీని నిలబెట్టుకోవడంతో పాటు తన వ్యతిరేకులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని మంచు ఫ్యామిలీ భావిస్తోంది. రాజీనామాలు చేసిన ప్రకాశ్‌రాజ్‌ టీమ్‌ కూడా మంచు విష్ణు హామీలపైనే ప్రశ్నిస్తామని తెలిపింది.

Manchu Vishnu : మంచు విష్ణు చెప్తానన్న గుడ్‌న్యూస్ ఇదేనా?

మంచు విష్ణు ఇవాళ ఎలాంటి శుభవార్త చెప్పబోతున్నాడోనని మా సభ్యులతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మా బిల్డింగ్‌ నిర్మాణంపై ప్రకటన చేస్తారా… లేక మా సభ్యులకు సినిమాల్లో అవకాశాలు కల్పించడంపై నిర్ణయం తీసుకుంటారా.. లేక మరేదైనా గుడ్‌న్యూస్‌ చెబుతారా అన్న చర్చ నడుస్తోంది.

ఎన్నో ట్విస్ట్‌ల మధ్య జరిగిన మా ఎన్నికల పోరులో మంచి విష్ణు ఘన విజయం సాధించారు. మా ఎన్నికలకు ముందు 14 వాగ్దానాలు చేశారు విష్ణు. ఇందులో ప్రధానమైనవి మా సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించడం, మా బిల్డింగ్‌ నిర్మాణం. వీటితోపాటు వృద్ధకళాకారులకు పెన్షన్‌, మా సభ్యులందరికీ శాశ్వత గృహ నిర్మాణం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లాంటి హామీలు ఉన్నాయి.

MAA President Manchu Vishnu: మంచు విష్ణుకు పవన్ కల్యాణ్ సలహా.. ఇదే..!

మహిళల రక్షణ కోసం హై పవర్‌ కమిటీ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తం ఇండస్ట్రీ అభివృద్ధికి, మా సభ్యుల సంక్షేమానికి 14 హామీలు ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించారు విష్ణు. ప్రధానమైన హామీల్లో ఏదో ఒకదానిపై ప్రకటన చేస్తారా… లేక మరేదైనా తీపి కబురు చెబుతారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

మొదటిది….అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న మా సభ్యులకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించడం. రెండు ..మా బిల్డింగ్..తన కుటుంబ సభ్యుల సొంత ఖర్చుతో బిల్డింగ్ కట్టడం. మూడు….సొంత ఇంటి కల…మా సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత గృహ నిర్మాణం. నాలుగు…వైద్య సహాయం…మా సభ్యులకు మరియు కుటుంబ సభ్యులకు ప్రి హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి మూడు నెలలకొకసారి మెడికల్ క్యాంపు మూడు లక్షలు వున్న జీవిత భీమా ను పెంచడం.

Allu Arjun : నా ఫ్రెండ్ బన్నీ అంటే నాకు అసూయ : మంచు విష్ణు

ఐదు….చదువుల తల్లి..మా సభ్యుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు విద్యా సహాయం. ఆరు…కళ్యాణ లక్ష్మి..అర్హులైన మా సభ్యులకు లక్ష పదహారు వేలు సహాయం కొనసాగించడం. ఏడు….మహిళ రక్షణ హై పవర్ కమిటీ..మహిళ సంక్షేమం వారి రక్షణ..వయస్సు తో సంబంధం లేకుండా వారికి ఆర్థిక సహాయం.

ఎనిమిది….వృద్ధ కళాకారుల సంక్షేమం..6000 వేలు ఇస్తున్న పెన్షన్ ను గణనీయంగా పెంచడం, ఇప్పటికే ధరకాస్తు చేసుకున్న వారికి పెన్షన్ ఇవ్వడం, రాష్ర్ట ప్రభుత్వాల తో సంప్రదించి పెన్షన్ పథకాలు మా సభ్యులకు కూడా వర్తింప చేయడం. తొమ్మిది…..ఓటు హక్కు. పది….మా మొంబర్ షిప్ కార్డు. పదకొండు….మా ఉత్సవాలు..ఫండ్ రైజింగ్ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు,క్రీడలు నిర్వహిస్తాం.

Pawan kalyan – Manchu Vishnu: పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన మంచు విష్ణు..!

పన్నెండు….కేంద్ర రాష్ట్ర పథకాలు…. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ను సంప్రదించి అర్హులైన కళాకారులకు పథకాలు అందేలా చెయ్యడం. పదమూడు…మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్…మా సభ్యుల పిల్లలకు 50పర్సెంట్ స్కాలర్ షిప్ తో శిక్షణ ఇప్పించడం. పద్నాలుగు…ప్రభుత్వాల సహాయ సహకారాలు. సినీ ఇండస్ట్రీ సమస్యలు, అభివృద్ధికి రెండు తెలుగు రాష్ట్రాల సహాయ సహకారాలు అభ్యర్థించడం.