RRR Malli : ఈ మల్లి ఎవరు.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?  ‘కొమ్మ ఉయ్యాల’ పాట ఎందుకంత హిట్..?

నిజానికి ట్వింకిల్ శర్మ ఫెయిర్ గా ఉంటుంది. కానీ.. అడవి బిడ్డ అలా ఉండదు కదా.. అందుకే.. బ్రౌనిష్ మేకప్ కోటింగ్ తో సినిమాలో మల్లిలా.. మట్టి మనిషిగా మనకు కనిపిస్తుంది.

RRR Malli : ఈ మల్లి ఎవరు.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?  ‘కొమ్మ ఉయ్యాల’ పాట ఎందుకంత హిట్..?

Rrr Malli

RRR Malli : RRRసినిమాలో మల్లి క్యారెక్టర్ ప్రేక్షకులకు థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్. మళ్లీ మళ్లీ ఆమె మోములోని అమాయకత్వం.. మల్లి పాడిన పాట.. గుర్తుకురావడం సహజం. ఆ పాట అంత బాగుంది కాబట్టే.. తెల్ల దొరసారి బలవంతంగా తమ బంగ్లాకు తీసుకెళ్తుంది. ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఈడ్చుకెళ్లి పనులు చేయించుకుని.. పాటలు పాడించుకుని.. దొరసాని లేడీ స్కాట్ రాక్షసానందం పొందుతుంది. భీమ్.. రామ్ తో కలిసి పాపను విడిపించడం.. పనిలో పనిగా గవర్నర్ ను లేపేయడం అనేది సినిమాటిక్ ఫీల్ తో చూసి ఆనందించాల్సిన అంశం.

Read This : RRR: ఫస్ట్ వీక్ దద్దరిల్లిన బాక్సాపీస్.. రాజమౌళికి మొదలైంది అసలు పరీక్ష!

ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత ఈ క్యారెక్టరే ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది ఈ సినిమాలో. అందుకే ఈ క్యారెక్టర్ కు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం కోసం రాజమౌళి భారీ కసరత్తు చేశాడు. సినిమా ప్రారంభపు షాటే ఈ అమ్మాయిపై వస్తుంది. లేడీ స్కాట్ చేతికి నెమలీకతో మైదాకు పెడుతూ పాటపాడుతుంటుంది.

అడవి బిడ్డ గెటప్ లో అందంగా ఒదిగిపోయిన ఈ ముగ్ధ మనోహర చిన్నారి అసలు పేరు ట్వింకిల్ శర్మ. ఈ పాత్రకు 160 మందికి పైగా చిన్నారుల ప్రొఫైల్స్ ను రాజమౌళి చెక్ చేశారట. ఐతే.. అప్పటికే డాన్స్ ఇండియా డాన్స్ , ఇండియాస్ బెస్ట్ డ్రామా బజ్ లాంటి నార్తిండియా టీవీ రియాలిటీ షోలతో ట్వింకిల్ పాపులర్ అవుతోంది. ఐతే.. ట్వింకిల్ ఫేస్ లో ఇన్నోసెన్స్ ను రాజమౌళి గుర్తుపట్టేశాడు. తన సొంత ఖర్చులతో ఫ్లైట్‌లో ఆడిషన్ కు తెప్పించి ఓకే చేశాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి ట్వింకిల్ శర్మ ఫెయిర్ గా ఉంటుంది. కానీ.. అడవి బిడ్డ అలా ఉండదు కదా.. అందుకే.. బ్రౌనిష్ మేకప్ కోటింగ్ తో సినిమాలో మల్లిలా.. మట్టి మనిషిగా మనకు కనిపిస్తుంది. అదీ.. రాజమౌళి ఇచ్చిన వేరియేషన్. ఆ పాత్రకు కల్పించిన ఎమోషనల్ టచ్ అదనం. “అన్నా.. అమ్మా యాదికొస్తుందే” అన్న మల్లి మాటలకు కదలని గుండె ఉండదు థియేటర్ లో. ఆ సమయంలో ఆమె అభినయం.. ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అన్నీ కూడా నటిగా ట్వింకిల్ కు ఉన్న మెచ్చూరిటీని చూపిస్తాయి.

Read This : RRR: ఆర్ఆర్ఆర్‌పై సీతక్క కామెంట్స్.. సూపర్ లాజిక్!

యైత్ క్లాస్ లో ఉండగానే RRR ఆఫర్ అందుకుంది. ఈ నాలుగేళ్ల కాలంలో.. ఇపుడు ఇంటర్ లోకి వచ్చేసింది.

14213325

RRR Malli

సినిమాలో రెండు సందర్భాల్లో ఈ పాట వస్తుంది. ఇంట్రడక్షన్ లో వచ్చిన పాటను సింగర్ అలేఖ్య పాడింది. కోటలో ఎన్టీఆర్ మల్లిని కలిసిన సందర్భంలో వచ్చిన పాటను సింగర్ కాల భైరవ పాడారు.
ఈ రెండు సందర్భాల్లో వచ్చే పాట లిరిక్స్ .. 10 టీవీ పాఠకులకు ఎక్స్ క్లూజివ్ గా అందిస్తున్నాం.

Introduction Male Version Song

కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాలా..
అమ్మ ఒల్లో నేను రోజూ ఊగాలా.. రోజూ ఊగాలా
కొమ్మ సాటున.. పాడే కోయిలా..
కో అంటే కూ అంటూ నాతో ఉండాలా.. నాతో ఉండాలా..
తెల్లారాలా.. పొద్దూకాలా..
అమ్మా నీ అడుగుల్లో అడుగెయ్యాలా..
కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాలా..
అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాలా.. రోజూ ఊగాలా
..

Male Version Song
కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాలా..
కళ్లు మూసుకుంటే ఉంటయ్ కండ్లళ్ల.. ఉంటయ్ కండ్లళ్ల

కొమ్మ సాటున పాడే కోయిల
కళ్ళు మూసుకోని సూడు గుండెల్లా
సూడు గుండెల్లా

సుట్టు నిలిచిన రాతి బండల్లా ఉంది
చెట్టు చిగురు ఆకు సూస్తుంది ఇయ్యాల
సూస్తుంది ఇయ్యాల

కను మూసి తెరిసేంత ఓపిక పడితే
కట్టు తెంపే కాలం వస్తుందియ్యాల
వస్తుందియ్యాల

85658

RRR Malli

67850976

RRR Malli