Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు టీజర్ గ్లింప్స్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ అంటోన్న చిత్ర యూనిట్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘టైగర్ నాగేశ్వర రావు’ నుండి త్వరలో ఓ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు టీజర్ గ్లింప్స్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ అంటోన్న చిత్ర యూనిట్

Interesting Buzz On Tiger Nageswara Rao Glimpse

Tiger Nageswara Rao: మాస్ రాజా రవితేజ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Tiger Nageswara Rao : వేట మొదలు పెట్టేస్తున్న రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు అప్డేట్!

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండగా, భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుండి ఇటీవల ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ కట్ చేసిందని.. త్వరలోనే ఈ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Tiger Nageswara Rao : మొదటి వేటకు సిద్దమవుతున్న టైగర్ నాగేశ్వరరావు..

అంతేగాక, ఈ వీడియో గ్లింప్స్‌ను నార్త్ వారికి చూపెట్టగా, వారు స్టన్ అయిపోయారట. దీంతో ఈ వీడియో గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి ఖచ్చితంగా సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుందని.. ఈ గ్లింప్స్ చూసి వారికి గూస్‌బంప్స్ ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో రవితేజను మునుపెన్నడూ చూడని విధంగా చూపించనుండగా, రేణు దేశాయ్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.