ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్‌తో ‘చీమ’ సినిమా!

  • Published By: vamsi ,Published On : February 4, 2020 / 05:19 AM IST
ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్‌తో ‘చీమ’ సినిమా!

మాగ్నమ్ ఓపస్ పతాకం‌పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న సినిమా ‘చీమ – ప్రేమ మధ్యలో భామ!’. ఈ సినిమా ఫిబ్రవరి 21వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోగా. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన టైటిల్ సాంగ్‌ని సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.

విభిన్న కథాంశంతో చీమ అంటూ ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ కొత్తగా అనిపిస్తుండగా.. ఈ సినిమా ఇప్పటి యూవతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణతితో ఉన్నారో తెలియజెప్పే సినిమా ఇది అని నిర్మాత లక్ష్మీ నారాయణ వెల్లడించారు. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుంది. అని తెలిపే సినిమా ఇది ఆయన అన్నారు.

అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్‌లుగా ఇందులో నటించగా.. సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు ఇందులో నటించారు. రవి వర్మ సంగీతం అందించగా ఆరిఫ్ లలాని సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం  : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు. నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ.