IIFA 2023 : దుబాయిలో ఘనంగా IIFA అవార్డుల వేడుక.. IIFA అవార్డుల ఫుల్ లిస్ట్..

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు(ఐఫా) 2023 అవార్డుల ఫుల్ లిస్ట్...

IIFA 2023 : దుబాయిలో ఘనంగా IIFA అవార్డుల వేడుక.. IIFA అవార్డుల ఫుల్ లిస్ట్..

International Indian Film Academy Awards IIFA 2023 Full Details

IIFA Dubai : ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు(ఐఫా) 2023 సంవత్సర వేడుక ఘనంగా దుబాయిలో జరిగింది. బాలీవుడ్ కి చెందిన ఈ అవార్డుల ఈవెంట్ కి అనేకమంది బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు, అవార్డులు తీసుకునేవారు ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు. పలువురు హీరోలు, హీరోయిన్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. 2022 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు గాను అవార్డులను అందచేశారు.

IIFA 2023 అవార్డుల ఫుల్ లిస్ట్…

ఉత్తమ సినిమా – దృశ్యం 2
ఉత్తమ దర్శకుడు – R మాధవన్(రాకెట్రీ)
ఉత్తమ నటి – అలియాభట్ (గంగూభాయ్ కతీయవాడి)
ఉత్తమ నటుడు – హృతిక్ రోషన్ (విక్రమ్ వేద)
ఉత్తమ సహాయ నటి – మౌనిరాయ్(బ్రహ్మాస్త్ర)
ఉత్తమ సహాయ నటుడు – అనిల్ కపూర్(జగ్ జాగా జీయో)
అవుట్ స్టాండింగ్ అచివ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు – కమల్ హాసన్
అవుట్ స్టాండింగ్ అచివ్మెంట్ ఇన్ సినిమా ఫ్యాషన్ – మనీష్ మల్హోత్రా
ఉత్తమ అడాప్టెడ్ స్టోరీ – దృశ్యం 2
ఉత్తమ ఒరిజినల్ స్టోరీ – డార్లింగ్స్
అవుట్ స్టాండింగ్ అచివ్మెంట్ ప్రాంతీయ సినిమా – వేద్
ఉత్తమ డెబ్యూ నటుడు – శంతను మహేశ్వరి (గంగూభాయ్ కతీయవాడి) మరియు బాబిల్ ఖాన్ (ఖలా)
ఉత్తమ డెబ్యూ నటి – ఖుషాలి కుమార్ (ఢోకా అరౌండ్ ది కార్నర్)
ఉత్తమ నేపథ్య గాయని – శ్రేయ ఘోషల్ (బ్రహ్మాస్త్ర రసియా సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయకుడూ – అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర కేసరియా సాంగ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – ప్రీతం (బ్రహ్మాస్త్ర)
ఉత్తమ గీతా రచయిత – అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర కేసరియా సాంగ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – గంగూబాయి కతీయవాడి
ఉత్తమ స్క్రీన్ ప్లే – గంగూబాయి కతీయవాడి
ఉత్తమ మాటలు – గంగూబాయి కతీయవాడి
ఉత్తమ కొరియోగ్రఫీ – భూల్ భూలయ్య 2
ఉత్తమ సౌండ్ – భూల్ భూలయ్య 2
ఉత్తమ ఎడిటింగ్ – దృశ్యం 2
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – బ్రహ్మాస్త్ర
ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – విక్రమ్ వేద
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – మోనికా ఓ మై డార్లింగ్

 

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి.. రాజకీయ చరిత్రపై స్పెషల్ ఫోకస్..
.