రాజ్ తరుణ్ మరో అర్జున్ రెడ్డి అయ్యేనా!

షాలినీ పాండేతో లిప్ లాక్ సీన్స్‌లో నటించడానికి మొదట సిగ్గు పడ్డ రాజ్ తరుణ్.. షాలినీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో బాగా ఇన్వాల్వ్ అయ్యి నటించాడట..

  • Published By: sekhar ,Published On : November 30, 2019 / 10:00 AM IST
రాజ్ తరుణ్ మరో అర్జున్ రెడ్డి అయ్యేనా!

షాలినీ పాండేతో లిప్ లాక్ సీన్స్‌లో నటించడానికి మొదట సిగ్గు పడ్డ రాజ్ తరుణ్.. షాలినీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో బాగా ఇన్వాల్వ్ అయ్యి నటించాడట..

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా.. దిల్ రాజు సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం: 35గా శిరీష్ నిర్మిస్తున ప్రేమకథా చిత్రం.. ‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేం జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ లుక్ కంప్లీట్‌‌గా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది.

మాస్ లుక్స్‌తో ఇప్పటిదాకా బీ గ్రేడ్ ఆడియెన్స్ అలరించిన రాజ్ తరుణ్ ఈ క్లాస్ లుక్‌తో అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. అంతే కాదు షాలినీ పాండేతో లిప్ లాక్ సీన్స్‌లో నటించడానికి మొదట సిగ్గు పడ్డ రాజ్ తరుణ్.. షాలినీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో బాగా ఇన్వాల్వ్ అయ్యి నటించాడట. దీంతో ఈ ముద్దు సన్నివేశాలు అర్జున్ రెడ్డి లిప్ లాక్స్‌ని గుర్తు చేసేలా ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హిట్ కోసం ఆ మాత్రం కష్టపడక తప్పదు కదా.. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఇద్దరిలోకం ఒకటే’ డిసెంబర్లో విడుదల కానుంది. కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : తమ్మిరాజు, మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్, మాటలు : అబ్బూరి రవి, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి – బెక్కెం వేణుగోపాల్.