IPL Movie : సిద్ శ్రీరామ్-సునీతల సెన్సేషనల్ సాంగ్..

సిద్ శ్రీరామ్, సునీత పాడిన ‘ఎవరివే ప్రేమ హృదయమా’ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

IPL Movie : సిద్ శ్రీరామ్-సునీతల సెన్సేషనల్ సాంగ్..

Ipl Movie

IPL Movie: బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్‌పై విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ‘ఐపీఎల్’ (ఇట్స్ ప్యూర్ లవ్) అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ ఆవిష్కరించారు. వెంగి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను ప్రముఖ గాయకులు సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదల అయ్యింది.

ఈ సందర్భంగా దర్శకులు వి వి వినాయక్ మాట్లాడుతూ.. ‘సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన ఈ పాట చాలా బాగుంది. సంగీత దర్శకుడు వెంగీ సంగీతం బాగుంది. చిత్ర దర్శకుడు సురేష్, నిర్మాత బీరం శ్రీనివాస్ చిత్ర యూనిట్‌కి అల్ ది బెస్ట్’..

Ipl Movie Songs

దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుత.. ‘మా ఐపిఎల్ సినిమా మొదటి సాంగ్ వినాయక్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషం వుంది. ఇందులో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ వున్నారు. సీనియర్ నటీనటులు నటించారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’..

Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..

హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్. సబ్జెక్ట్ బాగుంది. ఈ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా వుంది. దర్శకులు సురేష్ ఎంతో డెడికేషన్‌తో తెరకెక్కించారు. నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం’..

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి ట్వీట్.

నిర్మాత బీరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఈరోజు మా మూవీలోని పాటను డైనమిక్ డైరెక్టర్ వి వి వినాయక్ రిలీజ్ చెయ్యడం మాకు ఎంతో ఆనందంగా వుంది. సిద్ శ్రీరామ్, సునీత గారు ఆలపించిన లిరికల్ సాంగ్ చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. మా ఐపిఎల్ టీమ్‌ను ఆశీర్వదించిన వినాయక్ గారికి ధన్యవాదాలు. సంగీత దర్శకుడు వెంగి అద్భుతమైన బాణీలను సమకూర్చారు. పాటలు అన్నీ బాగా వచ్చాయి. ఈ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమా క్రికెట్ బెట్టింగ్స్ నేపథ్యంలో యువత లైఫ్ ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే కథాంశంతో తెరకెక్కుతుంది. తనికెళ్ళ భరణి, పోసాని, సుమన్ రచ్చ రవి మంచి క్యారెక్టర్స్ చేశారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు.

Bigg Boss 5 Telugu : అనీ మాస్టర్ ఎలిమినేషన్!

చిత్ర సంగీత దర్శకుడు వెంగి మాట్లాడుతూ.. ‘సిద్ శ్రీరామ్, సునీత గారు ఆలపించిన ఎవరివే ప్రేమ హృదయమా పాటను రిలీజ్ చేసి మాటీంను బ్లెస్ చేసిన ప్రముఖ దర్శకులు వినాయక్ గారికి కృతజ్ఞతలు. పాటలు అన్నీ బాగా వచ్చాయి. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేష్, నిర్మాత బీరం శ్రీనివాస్ గార్లకు థాంక్స్’..