IraKhan : నా బర్త్‌డే నా ఇష్టం.. ఇంకొన్ని బికినీ ఫోటోలు చూడండి.. ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చిన అమీర్‌ఖాన్ కూతురు..

ఇరాఖాన్ తల్లి తండ్రుల ముందే బికినీలో కేక్ కట్ చేసి ఆ పార్టీ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో బికినీలో పుట్టిన రోజు చేసుకోవడం ఏంటి, బికినీలో కేక్ కట్ చేయడం ఏంటి..............

IraKhan : నా బర్త్‌డే నా ఇష్టం.. ఇంకొన్ని బికినీ ఫోటోలు చూడండి.. ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చిన అమీర్‌ఖాన్ కూతురు..

Ira Khan

IraKhan :  బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్‌ కూతురు ఇరాఖాన్‌ ఇటీవల తన బర్త్‌డే వేడుకలు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఓ ప్రైవేట్ ప్లేస్ లో జరుపుకుంది. అక్కడి స్విమ్మింగ్ ఫూల్ లో బికినీ వేసుకొని రోజంతా అలాగే సెలబ్రేట్ చేసుకుంది. తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు. కేక్ కూడా బికినీలోనే కట్ చేసింది. అంతే కాకుండా ఇరాఖాన్ తల్లి తండ్రుల ముందే బికినీలో కేక్ కట్ చేసి ఆ పార్టీ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో బికినీలో పుట్టిన రోజు చేసుకోవడం ఏంటి, బికినీలో కేక్ కట్ చేయడం ఏంటి, పేరెంట్స్ ముందు అలా బికినీలో ఉండటం ఏంటి అని సోషల్ మీడియాలో ఇరాఖాన్ ని భారీ ఎత్తున ట్రోల్ చేశారు. తాజాగా ఇరాఖాన్ ఈ ట్రోలింగ్ కి వెరైటీగా కౌంటర్ ఇచ్చింది. ఆమె పుట్టినరోజు నాటి మరిన్ని బికినీ ఫోటోలని షేర్ చేసి.. నా బర్త్‌డే ఫొటోలను హేట్ చేయడం, ట్రోల్‌ చేయడం అయిపోయిందా? మీ కోసం మరిన్ని ఫోటోలు.. అంటూ పోస్ట్ చేసింది.

Pranitha : హీరోయిన్ ప్రణీతకు గ్రాండ్‌గా శ్రీమంతం.. వైరల్ అవుతున్న పిక్స్..

అయితే ఈ ఫోటోలంతో తను ఇలాంటివి పట్టించుకోదు, ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది అని కొందరు అంటుంటే, మరి కొంతమంది ఇలాంటి ఫోటోలు పెట్టి మళ్ళీ ట్రోలర్స్ తో ట్రోల్ చేయించుకోడానికి రెడీ అవుతుంది ఇరాఖాన్ అంటున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఇంతే కదా, వాళ్ళకి కొత్తగా చెప్పేదేముంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)