PVT04 : వైష్ణవ్ తేజ్ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ ఉగ్రరూపం..

ఏ డెబ్యూట్ హీరోకి సాధ్యంకాని ఫీట్ ని 'ఉప్పెన' సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సాధించాడు. ప్రస్తుతం ఈ హీరో తన 4వ సినిమాని సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రచార పోస్టర్ లు రిలీజ్ చేయగా.. తాజాగా మరో కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఈ మూవీలోని ప్రతినాయకుడి..

PVT04 : వైష్ణవ్ తేజ్ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ ఉగ్రరూపం..

Joju George playning villain role in Panja Vaisshnav Tej 4th movie

PVT04 : ఏ డెబ్యూట్ హీరోకి సాధ్యంకాని ఫీట్ ని ‘ఉప్పెన’ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సాధించాడు. మొదటి సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. అంతేకాదు యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో తన 4వ సినిమాని సిద్ధం చేస్తున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల, వైష్ణవ్ తేజ్ తో మొదటిసారి జత కట్టబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రచార పోస్టర్ లు రిలీజ్ చేయగా.. తాజాగా మరో కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.

#PVT04 : భయంకరమైన ప్రయాణం అంటూ.. సమ్మర్ బరిలో పంజా వైష్ణవ్ తేజ్..

ఈ మూవీలోని ప్రతినాయకుడి పాత్రని పరిచయం చేస్తూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పాత్రని నేషనల్ అవార్డు విన్నర్ మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ నటించబోతున్నాడు. ఇరాట్ట, జోసెఫ్, నయత్తు, తురముఖం, మధురం వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన జార్జ్ వైష్ణవ్ తేజ్ సినిమాలో ‘చెంగా రెడ్డి’ అనే పాత్రని పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో జార్జ్.. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్ తో నోట్లోని సిగరెట్ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

ఇక ఇటీవల జార్జ్ నటించిన ఇరాట్ట సినిమా సూపర్ హిట్ కావడంతో పోస్టర్ లో శుభాకాంక్షలు తెలియజేస్తూ పేర్కొన్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ పక్కా మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 29, 2023 న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.