సుందర్.సి – ‘ఇరుట్టు’ ట్రైలర్

నటుడు, దర్శకుడు సుందర్.సి, సాక్షి చౌదరి, సాయి ధన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఇరుట్టు'.. (ది డార్క్ నెస్).. ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 22, 2019 / 08:50 AM IST
సుందర్.సి – ‘ఇరుట్టు’ ట్రైలర్

నటుడు, దర్శకుడు సుందర్.సి, సాక్షి చౌదరి, సాయి ధన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఇరుట్టు’.. (ది డార్క్ నెస్).. ట్రైలర్ రిలీజ్..

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సుందర్.సి, సాక్షి చౌదరి, సాయి ధన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఇరుట్టు’.. (ది డార్క్ నెస్).. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తుండగా, దొరై డైరెక్ట్ చేస్తున్నాడు.

హారర్, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ‘ఇరుట్టు’ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. సుందర్.సి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ప్రేక్షకులను అనుక్షణం ఉత్కంఠతకు గురిచేస్తూ, భయపెట్టేలా ఉందీ ట్రైలర్. కెమెరా వర్క్, ఆర్ఆర్ బాగున్నాయి.

Read Also :ఎల్లువొచ్చే పాటకు థియేటర్స్‌లో రచ్చరచ్చ..

విమలా రామన్, వి.టి.గణేష్, యోగిబాబు తదితరులు నటిస్తున్న ‘ఇరుట్టు’ త్వరలో విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : ఈ.కృష్ణమూర్తి, ఎడిటింగ్ : ఆర్.సుదర్శన్, మ్యూజిక్ : గిరీష్, డైలాగ్స్ : ఇంద్ర సౌందర్ రాజన్, లిరిక్స్ : మోహన్ రాజ్.