Ileana : కత్రినా సోదరుడితో ఇలియానా డేటింగ్??

ఇటీవలే కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్‌ సెబాస్టియన్‌, ఇతర ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అయితే ఈ వేడుకల్లో ఇలియానా కూడా చేరింది. ఇలియానాకి, కత్రినాకి అంత క్లోజ్ రిలేషన్..............

Ileana : కత్రినా సోదరుడితో ఇలియానా డేటింగ్??

Ileana

Ileana :  దేవదాస్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరీ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి కొన్నేళ్లు టాలీవుడ్ ని ఏలింది. తెలుగులో కోటి రూపాయలు తీసుకున్న మొదటి హీరోయిన్ గా కూడా ఇలియానా పేరు సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఇలియానా అక్కడ కొన్ని సినిమాలు చేసి సక్సెస్ రాకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్ లోనే అడపాదడపా సినిమాలు చేస్తుంది.

ఈ గోవా బ్యూటీ గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉంది. చాలా సంవత్సరాలు డేటింగ్‌ చేసిన తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు. తాజాగా ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌ సోదరుడితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కత్రినా సోదరుడు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో ఇలియానా లవ్‌ లో ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Ranbir kapoor : తెలుగు సినిమా చేయడానికి రెడీ అంటున్న బాలీవుడ్ స్టార్..

ఇటీవలే కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్‌ సెబాస్టియన్‌, ఇతర ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అయితే ఈ వేడుకల్లో ఇలియానా కూడా చేరింది. ఇలియానాకి, కత్రినాకి అంత క్లోజ్ రిలేషన్ లేదు అయినా కత్రినా బర్త్ డే సెలబ్రేషన్స్ కి వచ్చింది ఎందుకు అని ఆరా తీస్తున్నారు. కత్రినా సోదరుడు సెబాస్టియన్‌ ఇలియానాని తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. కత్రీనా, ఇలియానా కూడా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన గ్రూప్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇలియానా, సెబాస్టియన్ గత కొంతకాలంగా లవ్ లో ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి దీనిపై ఇల్లి బేబీ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.