Love Story: చైతూ ‘లవ్‌స్టోరీ’ విడుదలకు ముహూర్తం ఖరారు?

చైతూ - సాయిపల్లవిల లవ్ స్టోరీ విడుదలకు ముహూర్తం పెట్టేసినట్లు తెలుస్తుంది. జులై నెలాఖరున ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు మొదలు కాగా.. సినిమాల విడుదల, ప్రసారాలపై చర్చలు జరుగుతున్నాయి.

Love Story: చైతూ ‘లవ్‌స్టోరీ’ విడుదలకు ముహూర్తం ఖరారు?

Love Story

Love Story: చైతూ – సాయిపల్లవిల లవ్ స్టోరీ విడుదలకు ముహూర్తం పెట్టేసినట్లు తెలుస్తుంది. జులై నెలాఖరున ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు మొదలు కాగా.. సినిమాల విడుదల, ప్రసారాలపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా థియేటర్లు మొదలుకానున్నాయి. సినీ పెద్దలు ఏపీలో కూడా సినిమాల విడుదలపై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎలాగు రెండు రాష్ట్రాలలో థియేటర్లు మొదలుకానున్న నేపథ్యంలో జులై నెలాఖరు నుండి సినిమాల విడుదలకు పలువురు ఆలోచనలో ఉన్నారు. అసలే మళ్ళీ థర్డ్ వేవ్ టెన్షన్ కూడా నెలకొనడంతో అసలు ఇప్పుడే సినిమాలను విడుదల చేయాలా వద్దా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు కూడా నెలకొనగా లవ్ స్టోరీ మేకర్స్ మాత్రం సినిమాను విడుదల చేసేందుకే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది.

లవ్ స్టోరీ సినిమాను జులై 30న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల కంప్లీట్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించగా ఇప్పటికే సారంగ దరియా పాట సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది. సాయిపల్లవి డాన్స్, నటనా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందని దర్శకుడు శేఖర్ స్వయంగా చెప్పడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి విడుదలపై అధికారిక ప్రకటన ఎప్పుడో చూడాలి!