Dasara Movie : నాని దసరా రెండు భాగాలుగా రాబోతోందా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. మొదటిసారిగా నాని ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది అంటా.

Dasara Movie : నాని దసరా రెండు భాగాలుగా రాబోతోందా?

Dasara Movie

Dasara Movie : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. మొదటిసారిగా నాని ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 90 కాలంనాటి బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీలో నాని రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్ అండ్ టీజర్ చిత్రం పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది అంటా.

Dasara Movie: నాని ‘దసరా’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే..?

పీరియాడిక్ స్టోరీ లైన్ కావడంతో ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కిందని, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సర్‌ప్రైజింగ్ గా ఉంచారు అంటూ ఒక వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వార్త హీరో నాని వరకు చేరడంతో ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు. ‘ఒక సినిమా దుమ్ము లేపడానికి 2 పార్ట్స్ ఉండక్కర్లేదు. ఒక్క పార్ట్ ఉన్నా చాలు. ఈ ఒక్క పార్ట్ లోనే 2, 3 పార్ట్స్ కి కావాల్సిన దమ్ము ఉంది’ అని చెబుతూ ట్వీట్ చేశాడు. దీంతో రెండు భాగాలుగా ‘దసరా’ రాబోతుంది అనే వార్తలకు చెక్ పడింది. కాగా ఈ సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్ చేశారు మూవీ టీం.

జనవరి 30న ఈ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ఓ వీడియో రూపంలో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ డీ గ్లామర్‌రైజ్ పాత్రలో కనిపించబోతుంది. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నానికి స్నేహితుడిగా ముఖ్యపాత్రలో కనిపిస్తుండగా సాయి కుమార్, సముద్రఖని, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అందిస్తున్నాడు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.