Ram Charan : షారుఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా మారిపోయాడు. తనతో సినిమా చేయాలని దర్శకనిర్మాతలు ఎంతో ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. తనకి ఉన్న ఫాలోయింగ్ ని కొందరు దర్శకులు వాళ్ళ సినిమాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే..

Ram Charan : షారుఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్?

is ram charan doing guest role in shah rukh khan jawan movie

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా మారిపోయాడు. తనతో సినిమా చేయాలని దర్శకనిర్మాతలు ఎంతో ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. తనకి ఉన్న ఫాలోయింగ్ ని కొందరు దర్శకులు వాళ్ళ సినిమాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు స్టార్ హీరోల ట్రైలర్ లను రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించి సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ తెలుగు ట్రైలర్ ని కూడా రామ్ చరణ్ చేత రిలీజ్ చేయనించారు.

Ram Charan : కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇద్దాం అనుకున్నా.. చరణ్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా షారుఖ్ కొత్త సినిమాలో రామ్ చరణ్ ని గెస్ట్ రోల్ చేయించడానికి మేకర్స్ సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో జవాన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర ఉంది. ఆ పాత్రని తమిళంలో విజయ్ చేస్తున్నాడు. తెలుగులో రామ్ చరణ్ తో చేయించడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం RRR ప్రమోషన్స్ లో అమెరికాలో ఉన్న చరణ్.. ఇండియా తిరిగి రాగానే కలిసి ఈ పాత్ర గురించి నేరేట్ చేయనున్నాడట అట్లీ. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు.

గతంలో ఈ పాత్రని తెలుగులో అల్లు అర్జున్ చేయబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం RC15 లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు కియారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఈ నెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటూ ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.