Balakrishna – NTR : బాలయ్య నిజంగానే ఎన్టీఆర్‌ని దూరం పెడుతున్నాడా.. రామ్‌చరణ్ చెప్పిన నిజమేంటి?

సినీ పరిశ్రమలో నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కాపాడుతూ వస్తున్నారు. అందుకు నందమూరి అభిమానులంతా ఎంతో గర్వపడుతున్నారు. కానీ నందమూరి కుటుంబంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అభిమానుల మనసుని బాధిస్తున్నాయి అంటున్నారు.

Balakrishna – NTR : బాలయ్య నిజంగానే ఎన్టీఆర్‌ని దూరం పెడుతున్నాడా.. రామ్‌చరణ్ చెప్పిన నిజమేంటి?

is really balakrishna ignoring ntr and what the ram charan says on it

Balakrishna – NTR : సినీ పరిశ్రమలో నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కాపాడుతూ వస్తున్నారు. టాలీవుడ్ లో బాలయ్య, ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో వారిద్దరిలా డైలాగ్ డెలివరీ చేసే మరో హీరో లేడు అనడంలో కూడా ఎవరికి సందేహం లేదు. ఇక మీసం రాని వయసు నుంచే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టిన ఎన్టీఆర్.. RRR చిత్రంతో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని నందమూరి పేరుని గ్లోబల్ స్థాయిలో వినిపించేలా చేశాడు.

NTR : ఎన్టీఆర్ పై హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

అందుకు నందమూరి అభిమానులంతా ఎంతో గర్వపడుతున్నారు. కానీ నందమూరి కుటుంబంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అభిమానుల మనసుని బాధిస్తున్నాయి. ఒక పక్క నందమూరి కుటుంబంలో జరుగుతున్న వరుస మరణాలు ఫ్యాన్స్ ని తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంటే.. మరోపక్క ఎన్టీఆర్ తో బాలకృష్ణ తీరు అభిమానులను తీవ్రంగా బాధిస్తుంది అంటున్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నాడు అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే తారకరత్న పెద్దకర్మ కార్యక్రమంలో జరిగింది అంటూ ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Balakrishna: మూడు దశాబ్దాల తరువాత ఆ ఫీట్ సాధించిన బాలయ్య

ఆ వీడియోలో బాలకృష్ణ.. ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ని పట్టించుకోకుండా పెద్దకర్మకు సంబంధించిన పనులు నిర్వర్తించడం కనిపిస్తుంది. దీంతో ఎన్టీఆర్ ని బాలకృష్ణ దూరం పెడుతున్నాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. నిజానికి తారకరత్న హాస్పిటల్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి బాలకృష్ణ అంతా తానై చూసుకోవడం వలన ఆ పనిలో బిజీగా ఉంటున్నాడు. అయినా ఇటీవల కాలంలో పలుమార్లు ఎన్టీఆర్, బాలకృష్ణ ఒకే స్టేజి పై కలిసి కనిపించారు. ఇక RRR ఆస్కార్ కి నామినేట్ అయ్యినప్పుడు కూడా బాలకృష్ణ.. ఎన్టీఆర్ తో పాటు చిత్ర యూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు.

ఒకే స్టేజి పై కలిసి కనిపించకపోయినా, అలాగే కలిసి మాట్లాడుకుంటూ కనబడనంత మాత్రాన వారిద్దరి మధ్య బంధం లేదు అనుకోవడం ఆలోచించే వారి తప్పు. గతంలో ఇదే విషయాన్ని రామ్ చరణ్.. చిరు, పవన్ విషయంలో తెలియజేస్తూ అభిమానులను అలా ఆలోచించవద్దు అంటూ వెల్లడించాడు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వాటిని గుడ్డిగా నమ్మేసి నెగటివిటీని స్ప్రెడ్ చేయకండి అంటూ కొందరు కామెంట్ లు చేస్తున్నారు.