Big Boss 5: ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఈమెనే?

చూస్తుండగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఐదవ వారం కూడా పూర్తి అవనుంది. ఈ ఆదివారం మరో కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకి వచ్చేయనున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో హౌస్‌లోకి వెళ్లిన 19 మంది..

Big Boss 5: ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఈమెనే?

Big Boss 5

Big Boss 5: చూస్తుండగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఐదవ వారం కూడా పూర్తి అవనుంది. ఈ ఆదివారం మరో కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకి వచ్చేయనున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో హౌస్‌లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో నాలుగు వారాలు నలుగురిని బయటకి పంపేశాడు బిగ్ బాస్. ఇప్పుడు ఐదవ వారంలో తొమ్మిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇందులో అనూహ్యంగా షణ్ముఖ్ కూడా నామినేట్ అయ్యాడు. నాలుగు వారాలు ఈ నామినేషన్ లో లేని షణ్ముఖ్ ఈ వారం రావడంతో ఆసక్తిగా మారింది.

Big Boss 5: హమీదా కావాలా?.. టైటిల్ కావాలా?.. శ్రీరామ్‌కు నాగ్ సూటి ప్రశ్న!

ప్రస్తుతం హౌస్‌లో 15 మంది సభ్యులు ఉండగా వారిలో ఈ వారం యాంకర్‌ రవి, షణ్ముఖ్‌ జశ్వంత్‌, మానస్‌, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ నామినేషన్ అయ్యారు. వీరిలో విశ్వ, జెస్సీ, సన్నీ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని ఇప్పటి వరకు సోషల్ మీడియాలో లీకులొచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆ ముగ్గురు కాకుండా హమీదా ఈ వారం ఎలిమినేషన్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. సహజంగా ఒకరోజు ముందే ఈ షో షూటింగ్ జరగడంతో తొలి వారం నుండే ఈ లీకుల బెడద బిగ్ బాస్ ను వేధిస్తుండగా ఈ వారం కూడా అదే విధంగా లీకైనట్లు తెలుస్తుంది.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

హమీదా ఏ విషయానైనా సూటిగా మాట్లాడే స్వభావం కలిగిన కంటెస్టెంట్ కాగా ఆమె హౌస్‌లో ఎక్కువగా శ్రీరామ చంద్రతోనే ఉండడం.. ప్రతి విషయానికి అతడిపైనే ఆధారపడుతుందన్న విమర్శలు వినిపించాయి. బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్‌ అవ్వాలని హమీదా కలలు కనగా అది తీరకుండానే ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోయిందని నెటిజన్లు చెవులు కొరుకుంటున్నట్టు తెలుస్తుంది. మరీ ఈ వారం హమీదా నిజంగానే హౌస్‌నుంచి వెళ్లిపోతుందా? లేదా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.