మార్ ముంతా చోడ్ చింతా : ఇస్మార్ట్ శంకర్ ఇరగదీసాడు

ప్పుడు రామ్ బర్త్‌డే సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : May 15, 2019 / 05:25 AM IST
మార్ ముంతా చోడ్ చింతా : ఇస్మార్ట్ శంకర్ ఇరగదీసాడు

ప్పుడు రామ్ బర్త్‌డే సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా.. ఇస్మార్ట్ శంకర్.. డబుల్ దిమాఖ్ హైదరాబాదీ.. అనేది ట్యాగ్ లైన్.. నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రామ్ గెటప్, ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రామ్ బర్త్‌డే సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ‘రేయ్, పతాహే మే కౌన్ హూ.. శంకర్, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’.. అంటూ, రామ్ తన గురించి తను ఇంట్రో ఇచ్చుకోడంతో ఇస్మార్ట్ శంకర్ టీజర్ స్టార్ట్ అవుతుంది.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. పక్కా లోకల్ కుర్రాడిగా రామ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అదరగొట్టేసాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంప్లీట్ పూరి హీరోలా మారిపోయాడు రామ్.. టీజర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్‌ని హైలెట్ చేస్తూ వినిపించిన సాంగ్ బాగుంది. ‘నాతో కిరికిరంటే, పోషమ్మ గుడిముంగట పొట్టేలుని కట్టేసినట్టే’.. అంటూ రామ్ చెప్పిన డైలాగ్ టీజర్‌కే హైలెట్ అయ్యింది.

ఇస్మార్ట్ డైలాగ్స్‌తో పూరీ మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. రాజ్ తోట విజువల్స్, మణిశర్మ ఆర్ఆర్ బాగున్నాయి. ప్రస్తుతం గోవాలో రామ్, నభా నటేష్‌లపై, కొరియోగ్రాఫర్ భాను నేతృత్వంలో ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. మరో మూడు పాటలతో సినిమా పూర్తవుతుంది. జూన్ లేదా జూలైలో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కానుంది.

వాచ్ టీజర్..