‘చంద్రయాన్-3పై నమ్మకంతో ఉన్నాం’

‘చంద్రయాన్-3పై నమ్మకంతో ఉన్నాం’

దేశం ప్రతిష్ఠాత్మకంగా భావించి మరికొద్ది క్షణాల్లో విజయవంతం అవుతుందనుకున్న ప్రాజెక్టు సాఫ్ట్ ల్యాండింగ్ దగ్గర్ సిగ్నల్ కోల్పోయి పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. అద్భుత ప్రయోగం చేసి లక్ష్యానికి 2కి.మీల దూరంలో మాత్రమే ఆగిపోవడంతో పెద్ద ఓటమిగా పరిగణించడం లేదు. యావత్ దేశమంతా మీ వెంటే ఉందని ప్రధాని మోడీతో సహా ఇస్రోకు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్ల రూపంలో పొగడ్తలు కురిపించారు. 

సైంటిస్ట్ రాకేశ్ ధావన్ పాత్రలో అక్షయ్ కుమార్ ఇటీవల నటించి మెప్పించిన సినిమా మిషన్ మంగళ్..  ఈ ప్రయోగంపై అక్షయ్ స్పందిస్తూ..  ‘ఎక్స్‌పర్మెంట్ లేకుండా సైన్స్ లేదు. ఒక్కోసారి సక్సెస్ అవుతాం. కొన్ని సార్లు నేర్చుకుంటాం. ఇస్రో ప్రయోగంలో పాల్గొన్న మేధావులందరికీ సెల్యూట్. మాకు గర్వంతో పాటు చంద్రయాన్ 3వస్తదనే నమ్మకంతో ఉన్నాం’ అని ట్వీట్ చేశాడు. 

షారూక్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. ‘ఒక్కోసారి అనుకున్న గమ్యానికి చేరుకోలేం. ముఖ్యమైన విషయమేమిటంటే మనకు నమ్మకం, ఆశ అనేవి బలంగా ఉండాలి. మన ప్రస్తుత పరిస్థితి ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదు. నమ్మకంతోనే పరిస్థితులు మార్చుకోగలం’ అని షారూఖ్ ట్వీట్ చేశాడు. 

బిగ్ బీ.. ట్వీట్ చేస్తూ ‘గొప్పదనంలో ఎప్పుడూ ఓటమి ఉండదు. మన గొప్పదనం, మన విజయం. ఇస్రోను చూస్తే గర్వంగా ఉంది’ అని పేర్కొన్నాడు. వీరితో పాటు కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్, లతా మంగేశ్కర్, తాప్సీ, శేఖర్ కపూర్, అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ, స్వరా భాస్కర్, డాలెర్ మెహిందీ, పూజా హెగ్దేలు ట్వీట్ల ద్వారా ఇస్రో గొప్పదనాన్ని కొనియాడారు.