IT చాప్టర్ టు – ట్రైలర్

సెప్టెంబర్ 6న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మకియు తమిళ్ భాషల్లో రిలీజ్ కానున్నహాలీవుడ్ హారర్ ఫిలిం.. IT (ఇట్) చాప్టర్ టు..

  • Published By: sekhar ,Published On : May 10, 2019 / 10:26 AM IST
IT  చాప్టర్ టు – ట్రైలర్

సెప్టెంబర్ 6న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మకియు తమిళ్ భాషల్లో రిలీజ్ కానున్నహాలీవుడ్ హారర్ ఫిలిం.. IT (ఇట్) చాప్టర్ టు..

హాలీవుడ్ హారర్ సినిమాలకెప్పుడూ వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉంటారు.. భయ పడతామని తెలిసినా భయపడుతూ చూడడం, మంచి ఇంట్రెస్టింగ్‌గా సినిమా చూస్తున్నప్పడు హఠాత్తుగా ఉలిక్కి పడడం లాంటి సంఘటనలు హాలీవుడ్ హారర్ సినిమాలు చూస్తున్నప్పుడే జరుగుతుంటాయి. ఇప్పుడు అదే కోవలో IT (ఇట్) అనే మూవీ రాబోతుంది. 2017లో వచ్చిన IT మూవీకి ఇది పార్ట్ టు.. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

రీసెంట్‌గా ఇట్ చాప్టర్ టు తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. చాలాకాలం తర్వాత తను గతంలో ఉన్న ఇంటిని చూడ్డానికి ఓ మహిళ ఆ ఇంటికి వెళ్ళడం, అక్కడున్న ముసలావిడని పరిచయం చేసుకోవడం, ఆమె లోపలికి ఆహ్వానించడం, మర్యాదలు చెయ్యడం.. ఇలా మొదలైన ట్రైలర్.. రకరకాల మలుపులు తిరిగి, ఆ మహిళతో పాటు ట్రైలర్ చూస్తున్న మనల్ని కూడా భయపెడతుంది. సెప్టెంబర్ 6న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మకియు తమిళ్ భాషల్లో రిలీజ్ అవనుంది.. IT (ఇట్) చాప్టర్ టు..

వాచ్ IT చాప్టర్ టు – ట్రైలర్..