బిగ్ బాస్ 4 లో లోక నాయకుడు

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 08:36 PM IST
బిగ్ బాస్ 4 లో లోక నాయకుడు

It’s a festival when King Nagarjuna and Lokanayakudu : బుల్లితెరపై బిగ్ బాస్ 4 సందడి కొనసాగుతోంది. అత్యధికంగా టీఆర్పీ సాధించి రికార్డు క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైన బిగ్‌బాస్ 4 కంటిన్యూ అవుతోంది. పలువురు హౌస్ నుంచి వెళ్లిపోయారు కూడా. ప్రస్తుతం 9వ వారానికి చేరుకుంది. ఈ ప్రోగ్రామ్ లో సౌత్ ఇండియా స్టార్, విలక్షణ నటుడిగా పేరు పొందిన కమల్ హాసన్ ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం కమల్ బర్త్ డే. ఈ సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.



తమిళ బిగ్ బాస్ లో నాలుగో సీజన్ కొనసాగుతోంది. హోస్ట్ గా కమల్ వ్యవహరిస్తున్నారు. వీడియో ద్వారా…కమల్ ప్రత్యక్షం కావడంతో తెలుగు కంటెస్టెంట్ ఆశ్చర్యపోయారు. భారతదేశం గర్వించదగిన నటుడు, కమల్ జీ అంటూ..వెల్ కం చెప్పారు. బాగున్నారా అంటూ కమల్ పలకరించారు. హౌస్ ఫుల్ గా ఉందని నాగ్ అనగా…నాకు నచ్చని మాట అంటూ చమత్కరించారు కమల్. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా విడుదల చేసింది.



ఇక బిగ్ బాస్ 4 విషయానికి వస్తే…19 మంది కంటెస్టెంట్లు ఉంటే..9వ వారం హౌస్ లో 10 మంది మాత్రమే మిగిలారు. నోయల్, గంగవ్వలు అనారోగ్యం కారణంగా హౌస్ నుంచి బయటకు రాగా..మిగిలిన ఏడుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉందని, అమ్మ రాజశేఖర్ ఈ ఆటలో లేరని నాగ్ తెలిపారు.



మోనాల్, అవినాష్ లు ఆటలో ఉన్నారని వెల్లడించారు నాగ్. హౌస్ మేట్స్ పర్సనల్ వస్తువులు అందులో వేస్తారని, కానీ..ఈ వస్తువులు మీకు తిరిగి రావన్నారు. ఎవరి బుట్ట బరువుగా ఉందో..వారికి ఇమ్యూనిటీ వచ్చిందని, ఎవరు ఇంట్లో ప్రేమిస్తున్నారో..బయటకు పంపించాలని అనుకుంటున్నారో ఇప్పుడు తేలిపోతుందని నాగ్ చెప్పడంతో ఉత్కంఠ నెలకొంది.