నాకు బాబు పుడతాడు : అమీ జాక్సన్

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 10:32 AM IST
నాకు బాబు పుడతాడు : అమీ జాక్సన్

బ్రిటీష్ బ్యూటి అమీ జాక్సన్‌ ప్రస్తుతం గర్భవతిగా తన ప్రయాణాన్ని చాలా సంతోషంగా గడుపుతోంది. ఓ వైపు త్వరలో తల్లిని కాబోతున్నాను అనే ఆనందం, మరోవైపు తనను మహారాణిలా చూసుకునే బాయ్ ఫ్రెండ్… ఈ సంతోషం ఆమె ముఖంలో క్లియర్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో ‘నేను బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను’ అని ఓ పార్టీలో అందరికీ అరిచి చెప్పింది.

సాధారణంగా ఇండియాలో అయితే పుట్టబోయేది ఆడబిడ్డా? మగబిడ్డా? అనే విషయం చివరి వరకు రహస్యంగా ఉంచుతారు. ఒకవేల డాక్టర్లు ముందే ఈ విషయం చెప్పడం లేదా పేరెంట్స్ ముందే తెలుసుకునే ప్రయత్నం చేయడం లాంటి పనులు చేస్తే నేరం. కానీ ఇంగ్లండ్‍‌లో అలాంటి ఆంక్షలు ఏమీ లేకపోవడంతో అమీ జాక్సన్ నాకు మగబిడ్డ పుట్టబోతున్నాడు అని ఇ ఓ పార్టీలో ప్రకటించారు.

Read Also :  చిరు ఇంట్లో సందడి చేసిన పవన్ భార్య.. వీడియో వైరల్

UKకి చెందిన జార్జ్‌ పనయోట్టు అనే బిజినెస్ మ్యాన్ తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు జనవరిలో తెలిపింది. ఈ ఏడాది మేలో అమీ – జార్జ్‌ల నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల అమీ డెలివరీ డేట్‌. అయితే బిడ్డ కడుపులో పడ్డాక నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తల్లిదండ్రులు అయ్యాక పెళ్లి చేసుకుంటామని తెలిపారు. 2020లో గ్రీస్ వేదిక‌గా పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది.