నమ్మవీట్టు పిళ్లై – సెప్టెంబర్ 27న విడుదల

శివ కార్తికేయన్, అనూ ఇమ్మానుయేల్ జంటగా, పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. 'నమ్మవీట్టు పిళ్లై' సెప్టెంబర్ 27 విడుదల..

  • Published By: sekhar ,Published On : September 21, 2019 / 06:56 AM IST
నమ్మవీట్టు పిళ్లై – సెప్టెంబర్ 27న విడుదల

శివ కార్తికేయన్, అనూ ఇమ్మానుయేల్ జంటగా, పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘నమ్మవీట్టు పిళ్లై’ సెప్టెంబర్ 27 విడుదల..

తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్, అనూ ఇమ్మానుయేల్ జంటగా.. కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మాణంలో, ఫ్యామిలీ సినిమాల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా.. ‘నమ్మవీట్టు పిళ్లై’.. ఐశ్వర్యా రాజేష్.. శివ కార్తికేయన్ చెల్లెలిగా నటించింది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా, నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అండ్ ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ‘నమ్మవీట్టు పిళ్లై’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కోలీవుడ్ సెన్సార్ టీమ్ చెప్పడం విశేషం. సినిమా చూసిన సెన్సార్ సభ్యలు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు.

Read Also : సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’..

మెరీనా, కేడి బిల్లా కిలాడి రంగా వంటి హిట్  సినిమాల తర్వాత శివ కార్తికేయన్, పాండిరాజ్ కాంబోలో వస్తున్న ‘నమ్మవీట్టు పిళ్లై’ హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని శివ కార్తికేయన్‌తో పాటు అతని ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. ఆర్.కె.సురేష్, నట్టి, సూరి, యోగిబాబు తదితరులు నటించిన ‘నమ్మవీట్టు పిళ్లై’ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. కెమెరా : నీరవ్ షా, మ్యూజిక్ : డి.ఇమాన్.