BiggBoss Non Stop: ఇట్స్ ఎలిమినేషన్ టైమ్.. ఈ వారం సరయు ఔట్?

బిగ్‌బాస్ నాన్ స్టాప్ నాలుగో వారం కూడా ఎలిమినేషన్ టైమ్ ఆసన్నమైంది. బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ సారి ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్నా అంతకు ముందు ఉన్న క్రేజ్ లేదు. కానీ బిగ్‌బాస్..

BiggBoss Non Stop: ఇట్స్ ఎలిమినేషన్ టైమ్.. ఈ వారం సరయు ఔట్?

BiggBoss Non Stop: బిగ్‌బాస్ నాన్ స్టాప్ నాలుగో వారం కూడా ఎలిమినేషన్ టైమ్ ఆసన్నమైంది. బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ సారి ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్నా అంతకు ముందు ఉన్న క్రేజ్ లేదు. కానీ బిగ్‌బాస్ అభిమానులు మాత్రం షోని తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఇక అందులో ఉన్న కంటెస్టెంస్ట్ అభిమానులు మాత్రం వాళ్ళ కోసం షో చూస్తూ వాళ్ళకి ఓట్లు వేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడు వారాలు పూర్తి చేసుకోగా ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.

BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఎవరున్నారంటే..

మొదటి వారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక, మూడవ వారం ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు నాలుగో వారం కూడా ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. నాలుగోవారం చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్‌ అవుతారనుకున్నారంతా. పెద్దగా పాపులారిటీ లేని అనిల్‌, మిత్ర శర్మలలో ఎవరో ఒకరు బయటకు వచ్చేయడం గ్యారంటీ అని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు సరయు ఈ వారం ఎలిమినేషన్ కాబోతుందని లీకు వీరులు ప్రచారం మొదలు పెట్టారు.

BiggBoss Non Stop : వన్ సెకండ్.. బిగ్‌బాస్ ఓటీటీలో ఓంకార్..

పేరుకే ఓటీటీ బిగ్ బాస్ కానీ.. ఇది లైవ్ స్ట్రీమింగ్ కాదు.. ఒకరోజు ముందే షూటింగ్ పూర్తయిన ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారని చెప్పుకుంటారు. అందుకే ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారన్నది ఒకరోజు ముందే బయటకి వచ్చేస్తుంది. అలా ఈ వారం సరయు హౌస్ ను వీడినట్లు చెప్తున్నారు. రెగ్యులర్ బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో తొలి వారమే ఎలిమినేట్ అయిన సరయు.. ఓటీటీ బిగ్‌బాస్‌లో ఎలాగైన టాప్ 5లోకి చేరుకోవాలని అనుకుంది. కానీ ఇక్కడ కూడా నాలుగు వారాలకే బయటకొచేసిందని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే ఈ ఆదివారం సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.