నా వైపు ఓ చూపు అప్పియ్యలేవా ‘జాను’

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. నటిస్తున్న తమిళ్ ‘96’ రీమేక్ ‘జాను’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : January 29, 2020 / 11:57 AM IST
నా వైపు ఓ చూపు అప్పియ్యలేవా ‘జాను’

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. నటిస్తున్న తమిళ్ ‘96’ రీమేక్ ‘జాను’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. తమిళ నాట సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘జాను’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Image
‘‘ఎగసిపడే ఈ కెరటాలలో ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను.. పిల్ల గాలి కోసం ఎదురుచూసే నల్ల మబ్బులా.. ఓర చూపు కోసం.. నీ దోర నవ్వు కోసం.. రాత్రంతా చుక్కల్లెక్క పెడుతుంది నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పియ్యలేవా’’.. అంటూ వర్ణించే శర్వా వాయిస్‌తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కరంగా ఉంది. ‘‘పది నెలలు మోసి కన్న మీ అమ్మకి నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే’’.. నా రామ్ నన్ను వెతుక్కుంటూ వచ్చేశాడు.. కె.రామచంద్ర.. నాకోసం.. జాను కోసం’’.. వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. శర్వా, సమంతల నటన అద్భుతంగా ఉండబోతోందని అర్థమవుతుంది. మహేంద్రన్ జయరాజన్ విజువల్స్, గోవింద్ వసంత ఆర్ఆర్ బాగున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ు పూర్తి చేసి ఫిబ్ర‌వ‌రి 7న సినిమాను విడుద‌ల చేయనున్నారు. 

Read Also : ‘సై సై సై రాజా సై సై.. చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్’

Image
సాంకేతిక వ‌ర్గం :
ద‌ర్శ‌క‌త్వం : సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌ : శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌ : శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం : గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ : మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌ : రామాంజ‌నేయులు
మాట‌లు : మిర్చి కిర‌ణ్‌
పాట‌లు : సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి.