Kevvu Kartheek : పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్.. సినీ, టీవీ సెలబ్రిటీల హాజరు..
తాజాగా నిన్న గురువారం నాడు కెవ్వు కార్తీక్ వివాహం జరిగింది. శ్రీలేఖ అనే అమ్మాయితో కార్తీక్ వివాహం ఘనంగా జరిగింది.

Jabardasth Comedian Kevvu Karthik Wedding with Srilekha Famous tv and cinema celebrities attended
Kevvu Kartheek Wedding : మిమిక్రి ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన కార్తీక్ జబర్దస్త్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం టీంలీడర్ గా ఎదిగి కెవ్వు కార్తీక్ గా పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ తో మంచి స్టార్ డం తెచ్చుకొని అనంతరం పలు సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు కెవ్వు కార్తీక్. ఇటీవలే తాను ఓ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని ప్రకటించారు.
తాజాగా నిన్న గురువారం నాడు కెవ్వు కార్తీక్ వివాహం జరిగింది. శ్రీలేఖ అనే అమ్మాయితో కార్తీక్ వివాహం ఘనంగా జరిగింది. కార్తీక్ వివాహానికి పలువురు టీవీ నటులు, టెక్నీషియన్స్, జబర్దస్త్ కమెడియన్స్, సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. కెవ్వు కార్తీక్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పలువురు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో కొత్త దంపతులకు కంగ్రాట్స్ చెప్తున్నారు.