Jabardasth : నువ్వంటే నిజంగానే ఇష్టం ఇమ్ము.. మీ అమ్మకి చెప్పు.. ఓపెన్ అయిన వర్ష.. | jabardasth varsha open and syas love towards emmanyuel

Jabardasth : నువ్వంటే నిజంగానే ఇష్టం ఇమ్ము.. మీ అమ్మకి చెప్పు.. ఓపెన్ అయిన వర్ష..

హైలెట్ చేస్తున్న జంటల్లో ఇమ్మాన్యుయెల్​-వర్ష జోడీ ఒకటి. ఈ జంటకి బాగానే స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ లో వీళ్ళ జంటతో కెమిస్ట్రీ పండించి టీఆర్పీలు కొట్టేశారు. ఇక స్టేజి మీద వీళ్ళు మాట్లాడే మాటలు వింటే..........

Jabardasth : నువ్వంటే నిజంగానే ఇష్టం ఇమ్ము.. మీ అమ్మకి చెప్పు.. ఓపెన్ అయిన వర్ష..

Varsha :  బుల్లితెరపై బాగా సక్సెస్ అయిన కార్యక్రమాల్లో జబర్దస్త్ ఒకటి. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ పేర్లతో గురు, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ షో నుంచి పలువురు సీనియర్స్ వెళ్లిపోగా కొత్తకొత్త వాళ్ళు వస్తున్నారు. ఇందులో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు ఆన్​స్క్రీన్​ కెమిస్ట్రీ, లవ్​ట్రాక్​ క్రియేట్ చేస్తూ ఉంటారు. చాలా రోజులు సుధీర్, రష్మీతో కెమిస్ట్రీ పండించారు. సుధీర్ జబర్దస్త్ నుంచివెళ్లిపోవడం, చాలా ఏళ్లుగా వీళ్ళనే చూపిస్తుండటంతో ఈ జంటని పక్కన పెట్టేసి మరి కొన్ని జంటలని హైలెట్ చేస్తున్నారు.

ఇలా హైలెట్ చేస్తున్న జంటల్లో ఇమ్మాన్యుయెల్​-వర్ష జోడీ ఒకటి. ఈ జంటకి బాగానే స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ లో వీళ్ళ జంటతో కెమిస్ట్రీ పండించి టీఆర్పీలు కొట్టేశారు. ఇక స్టేజి మీద వీళ్ళు మాట్లాడే మాటలు వింటే వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారనే అనుకుంటారు. అంతబాగా కెమిస్ట్రీని పండిస్తున్నారు వీళ్లిద్దరు. ఒక ఈవెంట్ లో ఏకంగా వీళ్లిద్దరికీ పెళ్లి కూడా చేశారు. వర్ష బయట కూడా కొన్ని ఇంటర్వ్యూలలో ఇమ్మాన్యుయేల్ గురించి గొప్పగా చెప్పింది. మేము ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని చెప్పింది. జబర్దస్త్ స్టేజి మీద కూడా పలు సార్లు ఇమ్మాన్యుయేల్ గొప్పతనం గురించి తెలిపింది.

Sai Pallavi : సాయిపల్లవి కశ్మీర్ ఫైల్స్ వ్యాఖ్యలపై విజయశాంతి సీరియస్..

దీంతో వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అని చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో స్కిట్ అయిపోయిన తర్వాత వర్ష చెప్పిన మాటలు వింటే వీరిద్దరిది నిజంగానే లవ్ అన్నట్టు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో జడ్జిగా ఉన్న ఇంద్రజ స్కిట్ అయిపోయిన తర్వాత.. సాధారణంగా ప్రేమించుకుంటున్న వాళ్ల మధ్య అనుమానాలు రావడం సహజమే. ఎప్పుడైనా మీ మధ్య అటువంటిది వచ్చిందా? అని వర్షని అడిగారు.

వర్ష దీనికి సమాధానమిస్తూ.. ”నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే అది నా ఇమ్ము మాత్రమే. ఎవరు ఏం అనుకున్నా నాకు ఎటువంటి సమస్య లేదు. వీడేంటి? ఆ అమ్మాయి ఏంటి? అదీ, ఇదీ, వీళ్ళిద్దరిదీ అలా ఇలా? అని అనుకున్నా నాకు ప్రాబ్లమ్ లేదు. ఈ రోజు నేను చెబుతున్నా ఇమ్మూ అంటే నిజంగా నాకు ఇష్టం” అని ఇమ్ము వైపు చూస్తూ తన ప్రేమను బయటపెట్టింది వర్ష. ఆ తర్వాత స్టేజి మీద నుంచి వెళ్తూ “మీ అమ్మకి చెప్పు కోడలు వస్తుందని” ఇమ్మాన్యుయేల్ తో చెప్పి వెళ్లిపోవడంతో ఇమ్మాన్యుయేల్ షాక్ లో ఉండగా అందరూ అతనికి కంగ్రాట్స్ చెప్తున్నారు.

Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..

అయితే ఇది చూడటానికి నిజంగా ఉన్నా ఇలాంటివి చాలా చేశారు గతంలో. దీంతో ఇది కూడా ప్రమోషనల్ స్టంట్ అని కొంతమంది అంటుంటే, కాదు నిజమే అని మరికొంతమంది అంటున్నారు. మరి అసలు నిజం ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనేమో.

×