Jackie Chan : కమ్యూనిస్ట్ పార్టీలోకి జాకీ చాన్!

హాంకాంగ్​కు చెందిన హాలీవుడ్ యాక్షన్ మూవీ​ స్టార్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ "జాకీ చాన్​"..తాను చైనా అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనా(CPC)లో చేరాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట బయటపెట్టారు.

Jackie Chan : కమ్యూనిస్ట్ పార్టీలోకి జాకీ చాన్!

Jackie Chan

Jackie Chan హాంకాంగ్​కు చెందిన హాలీవుడ్ యాక్షన్ మూవీ​ స్టార్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ “జాకీ చాన్​”..తాను చైనా అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనా(CPC)లో చేరాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట బయటపెట్టారు. ఓ చర్చా కార్యాక్రమంలో జాకీ చాన్​ ఈ మేరకు వెల్లడించారు.

జులై-1,2021న సీపీసీ వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్ ​పింగ్ రాజధాని బీజింగ్ లో చేసిన కీలక​ ప్రసంగంపై గురువారం(జులై-8,2021)బీజింగ్ లో నిర్వహించిన ఓ చర్చా కార్యాక్రమంలో చైనా సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చైనా ఫిల్మ్ అసోసియేషన్​ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీ చాన్​ ఈ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్టీలో చేరికపై తన ఆసక్తిని బయటపెట్టారు. సీపీసీ వందేళ్లలోపు చేస్తానని చెప్పిన హామీలను కొన్ని దశాబ్దాల్లోనే నెరవేర్చగలదని జాకీ చాన్ అన్నారు. సీపీసీలో తాను సభ్యుడిని అవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.

కొన్నేళ్లుగా సీపీసీకి జాకీ చాన్​ మద్దతిస్తున్నారు. సీపీసీకి చెందిన చైనీస్​ పీపుల్స్​ పొలిటికల్​ కన్సల్టేటివ్​ కాన్ఫరెన్స్ (పార్టీ నామినేట్ చేసిన నిపుణుల సలహా సంఘం)లో కూడా ఆయన కొంతకాలం సభ్యుడిగా పనిచేశారు. మరోవైపు, 2019లో హాంకాంగ్ ​లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనను వ్యతిరేకించి జాకీ చాన్​ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. హాంకాంగ్​, చైనా నా జన్మస్థలాలు, నా ఇళ్లు. చైనా నా దేశం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అలాగే నా ఇంటిని కూడా. హాంకాంగ్ లో​ త్వరలోనే శాంతి తిరిగి నెలకొంటుందని ఆశిస్తున్నాను అని హాంకాంగ్ లో నిరసనల సమయంలో​ వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు జాకీ చాన్.