Jackie Shroff : జైలర్‌లో మరో బాలీవుడ్ నటుడు.. స్టార్స్ తో నిడిపోతున్న జైలర్..

ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా జైలర్ తెరకెక్కిస్తుండటంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ నటుల్ని తీసుకొస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్.................

Jackie Shroff : జైలర్‌లో మరో బాలీవుడ్ నటుడు.. స్టార్స్ తో నిడిపోతున్న జైలర్..

Jackie Shroff :  గత కొంతకాలంగా రజినీకాంత్ కి సరైన విజయం పడలేదు. రజినీకాంత్ గత సినిమా అన్నాత్తే కూడా అంతగా ఆడలేదు. దీంతో ఈ సారి జైలర్ అనే సినిమాతో రాబోతున్నాడు రజినీకాంత్. తమిళ యువ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా జైలర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. జైలర్ సినిమా రజినీకి కలిసొచ్చిన మాస్, డాన్ కథల్లాంటి సినిమాల్లాగా ఉంటుందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా జైలర్ తెరకెక్కిస్తుండటంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ నటుల్ని తీసుకొస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్.. ఇలా ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో ఉన్నట్టు ప్రకటించారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ జైలర్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే జైలర్ షూటింగ్ లో పాల్గొన్న జాకీ ష్రాఫ్ స్టిల్ ని సెట్స్ నుంచి రిలీజ్ చేశారు.

Ricky Kej : వరసగా రెండోసారి.. మొత్తం 3 అంతర్జాతీయ అవార్డులను అందుకున్న భారతీయ సంగీత దర్శకుడు..

ఇక జైలర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని మాత్రం ప్రకటించలేదు. జైలర్ సినిమాతో అటు డైరెక్టర్ నెల్సన్, ఇటు రజినీకాంత్ ఇద్దరూ సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం రజినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.